Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Radhika Apte Reaction : దక్షిణాది సినిమాల్లో చేసేటప్పుడు కొన్నిసార్లు సెట్స్‌లో భయంకర అనుభవాలు ఎదురైనట్లు హీరోయిన్ రాధికా ఆప్టే తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు షేర్ చేసుకున్నారు.

Radhika Apte Reaction About South Film Industry : తెలుగులో 'లెజెండ్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే ఆమె... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు.
సెట్స్‌లో భయంకర అనుభవాలు
తనకు సెట్స్‌లో ఎన్నో భయంకర్ అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు రాధికా ఆప్టే. 'ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను ఒకప్పుడు సౌత్ సినిమాలు చేయాల్సి వచ్చింది. అక్కడ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కొన్నిసార్లు సెట్స్‌లో ఎన్నో భయానక అనుభవాలు ఎదుర్కొన్నా. నాకు నిజంగా డబ్బులు అవసరం కాబట్టే దక్షిణాది సినిమాల్లో నటించాను. సెట్ మొత్తం మీద నేను ఒక్కదాన్నే మహిళను. మారుమూల పట్టణాల్లో షూటింగ్ చేసి నా సిబ్బందిని కూడా అనుమతించేవారు కాదు.
సెట్‌లో మహిళల గురించి చాలా అసభ్యకరంగా జోకులు వేసే వారు. ఎంతో అసౌకర్యంగా ఉండేది. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ఉండే నేను ఆ రోజుల గురించి ఆలోచిస్తే ఇప్పటికీ నాకు భయం వేస్తుంది. ఇప్పటికీ నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొన్నిసార్లు ఆ కామెంట్స్ విన్నప్పుడు తనకు నవ్వాలో ఏడ్వాలో అర్థమయ్యేది కాదు. ఒంటరిగానే ఎంతో మానసిక వేదనకు గురయ్యా. ఏ హీరోయిన్‌కు, నటికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.' అని చెప్పారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?
వాళ్ల పేర్లు చెబితే...
బాలీవుడ్‌లో తనకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని... తాను వారిని కలవడానికి వెళ్లి వారితో మాట్లాడిన తర్వాత ఇక జీవితంలో వారిని కలవకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు రాధిక. 'ఇండస్ట్రీలో వారు చాలా గొప్ప పేరున్న వ్యక్తులు. అయితే, వారితో మాట్లాడిన తర్వాతే వాళ్ల నిజ స్వరూపాలు అలా ఉంటాయని తెలుసుకున్నా. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే అందరూ ఆశ్చర్యపోతారు.' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
2005లో బాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె... ఆ తర్వాత హిందీ, మలయాళం, మరాఠీ, తమిళ చిత్రాల్లో నటించారు. 2010లో వచ్చిన 'రక్త చరిత్ర' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్, లయన్, కబాలి మూవీస్‌లో నటించి మెప్పించారు.





















