Gopichand New Movie: ఫైట్ మాస్టర్‌కు గోపీచంద్ డైరెక్షన్ ఛాన్స్... సంకల్ప్ రెడ్డి తర్వాత సినిమాపై క్లారిటీ
Gopichand 35 Movie: 'ఘాజీ', 'అంతరిక్షం' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నారిప్పుడు. దీని తర్వాత కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాపై క్లారిటీ వచ్చింది.

కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎప్పుడూ రెడీ. అందులోనూ ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్లను డైరెక్టర్లు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ఉదాహరణకు... 'రణం'తో డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ అయ్యారు. కన్నడ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఏ హర్షను 'భీమా'తో తెలుగు తెరకు తీసుకు వచ్చారు. ఇప్పుడు మరొక టెక్నీషియన్‌కు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలిసింది.
దర్శకుడిగా మారుతున్న ఫైట్ మాస్టర్
తెలుగు ప్రేక్షకులలో కొంత మందికి ఫైట్ మాస్టర్ వెంకట్ (Fight Master Venkat) తెలిసే ఉండొచ్చు. అయితే... ఇండస్ట్రీలో హీరోలకు, దర్శక నిర్మాతలకు ఆయన బాగా తెలుసు. ఇప్పుడు ఆయన మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు.
Also Read: Trisha Vs Parthiban: తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్
ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకుడిగా మారుతున్న సినిమాలో గోపీచంద్ హీరోగా యాక్ట్ చేస్తారని తెలిసింది. ఇటీవల హీరోని కలిసి కథ చెప్పడం, అందుకు ఆయన ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయట. సమ్మర్ తర్వాత... జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్. గోపీచంద్ - వెంకట్ సినిమాను 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు.
ప్రస్తుతం 'ఘాజీ', 'అంతరిక్షం' సినిమాల ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు గోపీచంద్. ఆయన 33వ సినిమా అది. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సంకల్ప్ రెడ్డి తార్వత ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకుడిగా పరిచయం అయ్యే సినిమాను స్టార్ట్ చేయనున్నారు. అది గోపీచంద్ 35వ సినిమా అవుతుంది. మధ్యలో మరో సినిమా చేయనున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు కుమార్ సాయితో సినిమాను కొన్ని రోజుల క్రితం పూజతో ప్రారంభించారు. అది గోపీచంద్ 34వ సినిమా.
Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
ట్రెండింగ్ వార్తలు






















