Inka Em Anukoledhu: ఇంకా ఏం అనుకోలేదు... ఈటీవీ విన్‌తో వంశీ నందిపాటి కొత్త సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
Vamsi Nandipati New Movie: యువ నిర్మాత వంశీ నందిపాటి, ఈటీవీ విన్ సంస్థది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ కలయికలో కొత్త సినిమా 'ఇంకా ఎం అనుకోలేదు'ను అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ చెప్పారు.

ఈటీవీ విన్ ఓటీటీ (ETV Win OTT), యువ నిర్మాత వంశీ నందిపాటి (Vamsi Nandipati)ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'లిటిల్ హార్ట్స్' నుంచి మొదలు పెడితే ఈ కలయికలో పలు విజయవంతమైన సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
ఇంకా ఏం అనుకోలేదు... టైటిల్ ఇదే!
ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాత వంశీ నందిపాటి చేస్తున్న కొత్త సినిమాకు 'ఇంకా ఏం అనుకోలేదు' (Inka Em Anukoledhu Movie) టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ప్రణయ్ వల్లూరిపల్లి - గిరి పెమ్మసాని ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తుండగా... రేహాన్ షేక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు.
Also Read: Trisha Vs Parthiban: తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్
View this post on Instagram
'ఇంకా ఏం అనుకోలేదు' సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. వినూత్నంగా, మీమ్స్‌తో కూడిన సరదా వీడియో ద్వారా టైటిల్ అనౌన్స్ చేశారు. నటీనటుల వివరాలు వెల్లడించలేదు. కానీ రిలీజ్ డేట్ చెప్పేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ బ్రోమాంటిక్ కామెడీ సినిమాకు రమణా రెడ్డి, సమీర్ కన్ను సహ నిర్మాతలు.
ట్రెండింగ్ వార్తలు



















