అన్వేషించండి

Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?

Hydra aggression: మల్లంపేట-బాచుపల్లి ప్రాంతవాసులకు దశాబ్ద కాలంగా పీడకలగా మారిన రహదారి ఆటంకం ఎట్టకేలకు తొలగిపోయింది. ప్రణీత్ ఆంటిల్యా గోడను తొలగించి.. పబ్లిక్ రోడ్ సౌకర్యం కల్పించారు.

Hydra demolishes community wall and makes public road : హైదరాబాద్ శివారు బాచుపల్లి వద్ద ఉన్న ప్రణీత్ ఆంటిల్యా** గేటెడ్ కమ్యూనిటీ గోడనుహైడ్రా కూల్చివేసింది. అక్కడ రాకపోకలకు పబ్లిక్ రోడ్ సౌకర్యాన్ని కల్పించింది. అయితే తమది గేటెడ్ కమ్యూనిటీ అని ఆ విల్లాల యజమానులు ఆందోళనకు దిగుతున్నారు.   

అసలు వివాదం ఏమిటంటే? 

అసలు ఈ వివాదం ప్రణీత్ ఆంటిల్యా వెంచర్ ప్రారంభం నుంచే ఉంది. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం.. ఇది ఒక బహిరంగ లేఅవుట్  . అంటే ఇందులోని 40 ఫీట్ల రహదారిని ప్రజలందరూ వాడుకోవచ్చు. కానీ, నిర్వహణలో భాగంగా ప్రణీత్ ఆంటిల్యా నిర్వాహకులు దీనిని గేటెడ్ కమ్యూనిటీ గా ముద్ర వేసి, రహదారికి అడ్డంగా భారీ ప్రహరీ గోడను నిర్మించారు. దీనివల్ల మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి ప్రగతినగర్ వెళ్లాల్సిన వాహనదారులు అదనంగా 5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ అక్రమ గోడపై స్థానికులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా, హైడ్రా రాకతోనే మోక్షం లభించింది.

గేటెడ్ కమ్యూనిటీ యజమానుల వాదన 

హైడ్రా చర్యపై ప్రణీత్ ఆంటిల్యాలోని నివాసితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాము కోట్ల రూపాయలు వెచ్చించి గేటెడ్ కమ్యూనిటీ అని నమ్మి ఇళ్లను కొనుగోలు చేశామని, ఇప్పుడు తమ లోపలి రహదారిని పబ్లిక్ రోడ్డుగా మార్చితే భద్రత  ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బయటి వాహనాల రాకపోకల వల్ల శబ్ద కాలుష్యం, పిల్లల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వీరు హైకోర్టును ఆశ్రయించినా, కోర్టు మాత్రం డ్యూ ప్రొసీజర్  ఫాలో కావాలని హైడ్రాకు సూచించింది. చివరకు ఇది అధికారికంగా గేటెడ్ కమ్యూనిటీ కాదని, పబ్లిక్ రోడ్డును ఆక్రమించారని తేలడంతో హైడ్రా చర్యలు చేపట్టింది. 

హైడ్రా వ్యూహాత్మక అడుగు 

హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అధికారులు ఇరుపక్షాలతో చర్చించి, లేఅవుట్ ప్లాన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. హెచ్‌ఎండీఏ అనుమతించిన లేఅవుట్‌లో రహదారి కేటాయింపులు బహిరంగంగానే ఉన్నాయని నిర్ధారించుకున్నాకే గోడను తొలగించారు. కేవలం గోడను కూల్చడమే కాకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం వెంటనే అక్కడ  బీటీ రోడ్డు  నిర్మాణాన్ని ప్రారంభించింది.   పనులు పూర్తి  అయితే  ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఆకాశ్‌ వెంచర్‌, డ్రీమ్‌ వ్యాలీ, గ్రీన్‌ పార్కు కాలనీ వంటి పదుల సంఖ్యలోని కాలనీల ప్రజలకు ఈ రహదారి అందుబాటులోకి వచ్చింది. ప్రణీత్ ఆంటిల్యా నివాసితులు తమ ప్రైవసీ దెబ్బతింటుందని ఆందోళన చేస్తున్నారు.                                  

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget