అన్వేషించండి

Moosi politics: మూసీ ప్రక్షాళన రాజకీయాల్లో బీఆర్ఎస్ అగ్రెసిస్ ఎటాక్ - కాంగ్రెస్ డిఫెన్సివ్ గేమ్ - ఎవరిది పైచేయి?

Telangaa Congress: మూసి ప్రక్షాళన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నిజాలు చెప్పుకోలేకపోతోంది. బీఆర్ఎస్ చేసే వేల కోట్ల ప్రచారమే వైరల్ అవుతోంది.

Congress unable to tell  truth in Moosi politics: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్లో  కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వెనుకబడినట్లు కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టులను చేపట్టినప్పుడు వాటి వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను వివరించడంలో వైఫల్యం చెందితే, ప్రతిపక్షాలు కేవలం  ఖర్చు ను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మూసీ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు  అసలు లక్ష్యాలను వివరించడం కంటే, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తోంది.  

గాంధీ విగ్రహం కోసం వేల కోట్లు అంటూ బీఆర్ఎస్ ప్రచారం

ఖర్చు విషయంలో  బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు సామాన్య ప్రజల్లోకి వేగంగా వెళ్తున్నాయి. కేవలం ఒక విగ్రహం కోసం, మ్యూజియం కోసం వేల కోట్లు తగలేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే, గాంధీ విగ్రహం ,  దాని ప్లాట్‌ఫారమ్ నిర్మాణానికి అవుతున్న ఖర్చు దాదాపు రూ. 96.4 కోట్లు మాత్రమే. మొత్తం రూ. 5,812 కోట్ల ప్రాజెక్టులో ఇది చాలా స్వల్ప భాగం. అయితే, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీటి శుద్ధి, మళ్లింపు , గండిపేట పరిసరాల అభివృద్ధి వంటి అత్యంత కీలకమైన పనులకు కేటాయించిన రూ. 3,676 కోట్లను ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోయింది. ఫలితంగా, ఇది కేవలం ఒక  విగ్రహం ప్రాజెక్టు  అనే ముద్ర పడిపోయింది.

పదే పదే వివరణ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్ 

ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం వహిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ఏదైనా భారీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినప్పుడు దానివల్ల వచ్చే పర్యాటక ఆదాయం, భూగర్భ జలాల పెరుగుదల, మురుగునీటి శుద్ధి వల్ల నగర ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను డాక్యుమెంటరీల ద్వారా లేదా పబ్లిక్ ఫోరమ్స్ ద్వారా ప్రచారం చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పరిపాలనాపరమైన అనుమతులకే పరిమితమైంది. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రతిపక్షం, రూ. 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయం గురించి పదే పదే మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో ఇంత వృథా ఖర్చు అవసరమా? అనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. పారదర్శకత లోపించడం , క్షేత్రస్థాయిలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వడంలో విఫలం కావడం రేవంత్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది.

విగ్రహ సెంటిమెంట్ కూడా రాజకీయమే 

తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు కట్టిన ప్రభుత్వాలు మళ్ళీ అధికారంలోకి రాలేదనే సెంటిమెంట్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. మూసీ ప్రాజెక్టు మొత్తం కేవలం విగ్రహం చుట్టూ తిరగడం వల్ల ఈ సెంటిమెంట్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతోంది. నిజానికి మూసీ సుందరీకరణ అనేది హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్‌కు, భవిష్యత్తు అవసరాలకు సంబంధించింది. కానీ, ప్రభుత్వం విదేశీ పర్యటనలు, కన్సల్టెన్సీల నియామకంపై చూపిస్తున్న శ్రద్ధ.. సామాన్యులకు ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించడంలో చూపడం లేదు. ఒక అద్భుతమైన అభివృద్ధి ప్లాన్, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఎదురుదాడి మాని, వాస్తవాలను గణాంకాలతో సహా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Embed widget