అన్వేషించండి

West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!

West Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 7 నుంచి పదోతరగతి పరీక్షలలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు (21-40 సంవత్సరాలు) నెలకు రూ.1,500 భత్యం ప్రకటించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమ బెంగాల్ యువతకు నెలకు 1500 నిరుద్యోగ భృతి ప్రారంభించారు.
  • రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 40% తగ్గి, 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించారు.
  • రైతులకు వార్షిక ₹10,000 ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు.
  • దేవ్చా పచామి బొగ్గు ప్రాజెక్టుతో లక్ష మందికి ఉపాధి, విద్యుత్ కొరత తీరుతుంది.

West Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర యువతకు, రైతులకు భారీ వరాలు ప్రకటించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో సరికొత్త పథకాన్ని ఆమె ప్రారంభించారు. బెంగాల్‌ ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తూ, పారిశ్రామిక రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ,, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

నెలకు 1500 నిరుద్యోగ భృతి

రాష్ట్రంలో నిరుద్యోగ యువతను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమత బెనర్జీ ప్రకటించారు. సెకండరీ పరీక్ష (పదో తరగతి) ఉత్తీర్ణులైన, ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ప్రతి నెలా 1500 రూపాయల అలవెన్స్‌ను అందిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. 

వాస్తవానికి ఈ పథకం ఏప్రిల్‌్ 1 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యువతకు బహుమతిగా మార్చి ఈ నెల నుంచి ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి మరే ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాని సుమారు కోటి మంది యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. కేవలం స్కాలర్‌షిప్‌ పొందే విద్యార్థులకు కూడా ఈ యువ సాథి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

పారిశ్రామిక ప్రగతి బాటలు 

పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని మమత వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగం 40 శాతం మేర తగ్గిందని తెలిపారు. సుమారు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఉత్కర్ష బంగ్లా పోర్టల్ ద్వారా పారిశ్రామికవేత్తల వెబ్‌సైట్లను ఇంటర్‌లింక్ చేయడం వల్ల శిక్షణ పొందిన పది లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించిందని ఆమె వివరించారు. 

ఐటీ రంగంలో బెంగాల్ అగ్రగామిగా ఎదుగుతోందని చెబుతున్నారు. బెంగళూరు కంటే కోల్‌కతాలోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. ఇటీవల కాలంలోనే సుమారు 200 కొత్త కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని ఆమె తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో కూడా బెంగాల్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, సుమారు 1.5 కోట్ల మంది ఈ చిన్న తరహా పరిశ్రమల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని వెల్లడించారు. 

వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన 

రైతుల సంక్షేమం కోసం బెంగాల్‌ ప్రభుత్వం ప్రతి ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో తక్కువ భూమి ఉన్న వారికి నాలుగు వేలు ఇచ్చామని ఇప్పుడు భూమి లేని వారికి కూడా నాలుగు వేలు సాయం ప్రకటించామని వివరించారు. 

రాష్ట్రవ్యాప్త కనెక్టివిటీ కోసం ఆరు ఆర్థిక కారిడార్ల నిర్మాణం జరుగుతోందని, సల్బోనిలో 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు భారీ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని వివరించారు. బంతాలాలోని లెద్‌ హబ్‌ ద్వారా 7.5 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని, రాష్ట్రంలోని 12లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలు అద్భుతమైన పని తీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. 

భవిష్యత్‌పై భరోసాకు దేవ్‌చా పచామి ప్రాజెక్టు 

బీర్భూమ్‌ జిల్లాలోని దేవ్‌చా పచామి బొగ్గు నిక్షేపాల ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చబోతోందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాబోయే వందేళ్ల వరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని ఆమె హామీ ఇచ్చారు. 

Frequently Asked Questions

పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగ యువతకు నెలకు ఎంత భృతి లభిస్తుంది?

సెకండరీ పరీక్ష (పదో తరగతి) ఉత్తీర్ణులైన, ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ప్రతి నెలా 1500 రూపాయల అలవెన్స్‌ను అందిస్తున్నారు.

యువ సాథి పథకానికి ఎవరు అర్హులు?

21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, మరే ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాని వారు, స్కాలర్‌షిప్‌ పొందే విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులు.

పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగ రేటు ఎంత తగ్గింది?

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 40 శాతం మేర తగ్గింది. సుమారు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు.

ఐటీ రంగంలో పశ్చిమ బెంగాల్‌ ప్రగతి ఏమిటి?

ఐటీ రంగంలో బెంగాల్‌ అగ్రగామిగా ఎదుగుతోంది. బెంగళూరు కంటే కోల్‌కతాలోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది.

రైతులకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఏ విధంగా సహాయం అందిస్తోంది?

రైతులకు ప్రతి ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో తక్కువ భూమి ఉన్న వారికి, ఇప్పుడు భూమి లేని వారికి కూడా నాలుగు వేలు సాయం ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bangalore Viral News: పిల్లి పిల్లలకు తండ్రెవరు? - పోలీసుల వద్దకు చేరిన బెంగళూరులో రెండు కుటుంబాల పంచాయతీ
పిల్లి పిల్లలకు తండ్రెవరు? - పోలీసుల వద్దకు చేరిన బెంగళూరులో రెండు కుటుంబాల పంచాయతీ
Tamil Nadu Assembly Elections: స్టాలిన్‌కు ఆయుధంగా దొరికిన డీలిమిటేషన్ - సెంటిమెంట్‌తో క్లీన్ స్వీప్ చేస్తారా?
స్టాలిన్‌కు ఆయుధంగా దొరికిన డీలిమిటేషన్ - సెంటిమెంట్‌తో క్లీన్ స్వీప్ చేస్తారా?
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
US-Iran War: ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
Advertisement

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration shops: రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
TDP Son Rise: మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
Peddi Postponed: జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
Embed widget