Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
ఫ్యూచర్ కెప్టెన్ అతనే. ఇప్పటికే టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టును నడిపిస్తున్నాడు. టీ20ల్లోనూ సేమ్ సీన్. సూర్య తర్వాత తనే నాయకుడు అన్నట్లు బీసీసీఐ తీరు కనిపించింది. పైగా వైస్ కెప్టెన్సీ కూడా అప్పగించింది. కానీ అనూహ్యంగా బళ్లు ఓడలు ఓడలు బళ్లు అయ్యాయి. గడచిన 17 టీ20 మ్యాచుల్లో కనీసం అర్థసెంచరీ కూడా చేయని గిల్ ను వరల్డ్ కప్పుకు కొనసాగించటం భావ్యం కాదని భావించిన సెలెక్షన్ కమిటీ...ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికా సిరీస్ లో అవకాశం వచ్చినా వినియోగించుకోలేక పోయిన గిల్ ను నిర్దాక్షిణ్యంగా వరల్డ్ కప్పు ప్రాబబుల్స్ నుంచి తొలగించింది. ఫలితంగా మరో ఓపెనర్, అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంజూ శాంసన్ కు లైన్ క్లియర్ అయినట్లుంది. ఫామ్ ఆధారంగా గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు అనే ఊహాగానాలను మరింత ఎక్స్ ట్రీమ్ కి తీసుకువెళ్తూ అసలు గిల్ కు వరల్డ్ కప్పు జట్టులో చోటు కూడా కల్పించకుండా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గిల్ స్థానంలో అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది.





















