Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
Nicols Maduro Arrest | వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతులను అమెరికా అదుపులోకి తీసుకున్న ఈ ఆపరేషన్‌ను సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ దాడులతో పోల్చారు.

వెనిజులాలో శనివారం (జనవరి 3న) జరిగిన దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అమెరికా ప్రభుత్వం అదుపులో ఉన్నారని పేర్కొన్నారు. వెనిజులా ప్రస్తుత అధ్యక్షుడుని, వారి సొంత రాజధాని నుండి అమెరికా అదుపులోకి తీసుకోవడం అనేది అరుదైన ఘటనగా నిలిచింది. ట్రంప్ హయాంలో జరిగిన ఈ చర్యను గతంలో అమెరికా సద్దాం హుస్సేన్, ఒసామా బిన్ లాడెన్ లను పట్టుకున్న దాడులతో పోలుస్తున్నారు.
సద్దాం హుస్సేన్, లాడెన్ తర్వాత ఇప్పుడు మదురో
నికోలస్ మదురోను వెనిజులాకు వెళ్లి పట్టుకోవడాన్ని, మొత్తం ప్రాంతాల రూపురేఖలను మార్చిన సద్దాం హుస్సేన్, ఒసామా బిన్ లాడెన్ లను పట్టుకున్న అమెరికా దాడులతో సీనియర్ భద్రతా విశ్లేషకులు పోల్చారు. వెనిజులా అధ్యక్షుడు మదురో, అతని భార్య బ్రతికే ఉన్నారని చెప్పారు. మదురో నిజంగా అధికారం నుండి తొలగించబడితే, వెనిజులా, ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఏమిటనే పెద్ద ప్రశ్న తలెత్తుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనికి అత్యంత చారిత్రాత్మక ఉదాహరణ 1989లో పనామా నాయకుడు మాన్యుయెల్ నోరిగాను అరెస్ట్ చేయడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్ నిలిచింది. మదురో లాగే, నోరిగా కూడా వివాదాస్పదంగా ఎన్నికలలో గెలిచినట్లు ప్రకటించుకున్నారు. వాషింగ్టన్ ఆయనపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేసింది. మదురోను అధికారం నుండి తొలగించడానికి ముందు అమెరికా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చింది.
మాన్యుయెల్ నోరిగా, మదురోల చరిత్ర ఒకటే: నిపుణులు
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మదురో ఘటనకు అత్యంత దగ్గరి చారిత్రాత్మక ఉదాహరణ 1989లో పనామా నాయకుడు మాన్యుయెల్ నోరిగాను అరెస్ట్ చేయడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్. మదురో లాగే, నోరిగా కూడా ఎన్నికలలో గెలిచినట్లు ప్రకటించుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఆయనపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేసింది. అతన్ని అధికారం నుండి తొలగించడానికి ముందు అమెరికా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చింది. నోరిగా అరెస్ట్, పనామా సైన్యాలు త్వరగా ఓడిపోయిన ఒక సాంప్రదాయ యుద్ధం తర్వాత జరిగింది.
ఈసారి అమెరికా విధానంలో భారీ వ్యత్యాసం కనిపించింది. బీబీసీ నిపుణుల ప్రకారం, భూతలం మీద దాడి లేకుండా కారకాస్ నుండి ప్రస్తుత అధ్యక్షుడు మదురో, అతని భార్యను తరలించడం, నోరిగా అరెస్ట్ తో పోలిస్తే ఒక పెద్ద ఆపరేషన్ అవుతుంది. అమెరికా తరపున ఒక దేశ రాజధానిలో ఇలాంటి ఖచ్చితమైన చర్యను చేపట్టడం, భద్రతాపరంగా చాలా సున్నితమైనది.
అమెరికా ఈ చర్యను ఒసామా బిన్ లాడెన్ పై ఆపరేషన్, సద్దాం హుస్సేన్ అరెస్ట్ లను గుర్తుచేస్తుందని సీఎన్ఎన్ లో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల చీఫ్ నిక్ పాటన్ వాల్ష్ అన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవీకాలంలో అత్యంత శక్తివంతమైన విదేశీ సైనిక జోక్యంగా అభివర్ణించారు.ప్రపంచవ్యాప్తంగా పనిచేయడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎంత స్వేచ్ఛను విశ్వసిస్తారో ఇది చూపుతుందని అన్నారు.
యూఎస్ అటార్నీ జనరల్ బాండీ మాట్లాడుతూ.. 'నికోలస్ మదురో, అతని భార్య, సిలియా ఫ్లోరెస్ లపై న్యూయార్క్ దక్షిణ జిల్లాలో కేసు నమోదైంది. మదురోపై మాదకద్రవ్యాలకు సంబంధించిన తీవ్రవాద కుట్ర (నార్కో-టెర్రరిజం), కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్ గన్,విధ్వంసక పరికరాల స్వాధీనం, యునైటెడ్ స్టేట్స్ కు వ్యతిరేకంగా మెషిన్ గన్, విధ్వంసక పరికరాల స్వాధీన కుట్ర ఆరోపణలు ఉన్నాయి. వారు త్వరలో అమెరికా కోర్టులలో విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది' అన్నారు.
వెనిజులాకు భవిష్యత్తు ఏమిటి?
మదురోను బలవంతంగా అధికారం నుండి తొలగిస్తే వెనిజులాలో అనిశ్చితి నెలకొంటుంది. అమెరికా జోక్యంతో ఇది ప్రజాస్వామ్య మార్పునకు మార్గం తెరుస్తుందని, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరినా మచాడో, 2024 ఎన్నికల ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ వెనిజులా అధ్యక్షుడిగా అధికారం చేపట్టే అవకాశం లభిస్తుందని వాదిస్తున్నారు.
నేర సామ్రాజ్యాలు, కొలంబియన్ గెరిల్లా గ్రూపులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ లు దేశంలో చురుకుగా ఉన్నాయి. మదురో లేకపోయినా అవి రాత్రికి రాత్రే అదృశ్యం కావు. దేశ రాజకీయాల్లో అస్థిరత, అధికారం కోసం పోరాటం, సైనిక ఉన్నత వర్గాలతో ప్రతిపక్షం ఇదివరకే చర్చలు మొదలుపెట్టింది.






















