Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
టీమ్ లోకి పదేళ్లైంది. టీమిండియా జెర్సీ వేసి దశాబ్దం దాటింది. కానీ ఇప్పటి వరకూ ఆడింది 50 మ్యాచులు కూడా లేవు. ప్రతీసారి సిరీస్ కి తీసుకుంటారు. కానీ ఫైనల్ 11లో ప్లేస్ ఇవ్వరు. ఇచ్చిన మ్యాచులు హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదుతాడు. లాస్ట్ 15 అంతర్జాతీయ మ్యాచుల్లో మూడు సెంచరీలు బాదాడు. అయితే తర్వాత రెండు మూడు సిరీస్ లు ఎక్కడున్నాడో కూడా కనపడకుండా చేస్తారు. ఈలోపు గాయాలతో సతమతమైపోతుంటాడు. నిజంగా దురదృష్టవంతుడా లేదా ఎవరైనా కావాలనే తొక్కేస్తున్నారా తెలియదు. టీమ్ లో ఎంతో సీనియర్ అయినా...31ఏళ్ల వయస్సు వచ్చినా ఇప్పటికీ కొత్త కుర్రాళ్ల కోసం తన స్థానాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి. కెరీర్ ముందు నుంచి సంజూ శాంసన్ అనే ఆటగాడిని ఇలా వెక్కిరించిన సవాళ్లు ఎన్నో. మొత్తం మీద తొలిసారిగా ఓ వరల్డ్ కప్పులో పూర్తి స్థాయి ఆటగాడిగా స్థానం సంపాదించాడు సంజూ శాంసన్. 2024 టీ20 వరల్డ్ కప్పు జట్టుకు ఎంపికైనా ఫైనల్ 11 లో చోటు దక్కించుకోలేకపోయినా శాంసన్...2025 ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడే తప్ప మ్యాచ్ లు ఆడలేదు. అలాంటిది ఈ గిల్ పై పడిన వేటు శాంసన్ కి దారిని క్లియర్ చేసేసింది. గిల్ ఫామ్ లో లేని కారణంగా వరల్డ్ కప్పు జట్టులో తనకు చోటు దక్కకపోవటంతో శాంసన్ ను పూర్తి స్థాయి వికెట్ కీపర్ బ్యాటర్ గా 2026 టీ20 వరల్డ్ కప్పు జట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. శాంసన్ కు బ్యాకప్ గా ఇషాన్ కిషన్ ను తీసుకుంది. మొత్తంగా తన ఎన్నో ఏళ్ల కల వరల్డ్ కప్పు డ్రీమ్ ను శాంసన్ ఫుల్ ఫిల్ చేసుకుంటాడా..ఢిపెండింగ్ ఛాంపియన్ కోసం సెల్ఫ్ లెస్ గా ఆడి యంగ్ స్టర్స్ ను వికెట్ల వెనుక నుంచి గైడ్ చేస్తాడా...శాంసన్ అభిమానులు ఫుల్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ వరల్డ్ కప్పు కోసం.





















