Year Ender 2025: యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు
Super Hit Movies 2025 South: ఈ ఏడాది సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలతో దుమ్ము దులిపారు. ఇంతకీ, వాళ్ళు ఎవరో చూడండి.

ఈ సంవత్సరం సౌత్ సినిమాకు అద్భుతంగా ఉంది. దక్షిణాదిలో అనేక చిన్న, పెద్ద బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించడమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాయి. 2025లో కొంత మంది స్టార్లు తమ నటనతో సర్‌ప్రైజ్ చేశారు. వాళ్ళు ఎవరో తెలుసుకోండి
లోకా చాప్టర్ 1: చంద్రలో కళ్యాణి ప్రియదర్శన్
జానపద కథల ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో కథతో కళ్యాణి ప్రియదర్శన్ 'కొత్త లోక ఛాప్టర్ 1' చేశారు. అద్భుతమైన నటన కనబరిచారు. నటిగా కెరీర్‌ను ప్రారంభించి చాలా సంవత్సరాల తర్వాత 'లోకా: చాప్టర్ 1 - చంద్ర'లో చంద్ర పాత్రతో కళ్యాణి ప్రియదర్శన్ బాక్సాఫీస్‌లోనూ తనదైన ముద్ర వేసింది.
బెంగళూరుకు వచ్చి ఒక అక్రమ ముఠా బారిన పడిన ఒక యువ, రహస్యమైన మహిళ కథ 'లోక' సినిమా. మలయాళ సినిమాలో ఒక అసాధారణమైన సూపర్ హీరోయిన్ పాత్రను పరిచయం చేయడమే కాకుండా... ఒక అద్భుతమైన ఫ్రాంచైజీని మొదలు పెట్టారు.
'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'లో ప్రియదర్శి పులికొండ
తెలుగులో వచ్చిన చక్కటి లీగల్ డ్రామా 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. న్యాయ వ్యవస్థలో పాతుకుపోయిన పక్షపాతం, అవినీతితో పోరాడే ఒక ఉత్సాహవంతుడైన న్యాయవాది సూర్య తేజ కథగా ప్రియదర్శి నటన ప్రశంసలు అందుకుంది. ఓ 19 ఏళ్ల అబ్బాయిపై అన్యాయంగా మోపబడిన కేసును అతను టేకప్ చేసిన తర్వాత నాటకీయ మలుపులను చూపించిన తీరు ప్రశంసనీయం. ప్రియదర్శి పులికొండ 'కోర్టు' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు.
'కాంత'లో దుల్కర్ సల్మాన్
మద్రాస్ సూపర్ స్టార్ టి.కె. మహదేవన్ (టి.కె.ఎం. అని కూడా పిలుస్తారు) జీవితం నుంచి స్ఫూర్తి పొందిన కథతో 'కాంత' రూపొందింది. ఇదొక ఫిక్షనల్ కథ. మహదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించడం ఈ సినిమాకు అతి పెద్ద బలం. దుల్కర్ సల్మాన్ ఈ పాత్రను చాలా చక్కగా పోషించి, అంతర్గత సంఘర్షణను అద్భుతంగా వ్యక్తీకరించాడు. అతని నటనను నిజంగా గుర్తుండిపోతుంది.
కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్
ఈ సంవత్సరం ఎంతో మంది మెచ్చిన సినిమా 'కాంతార: చాప్టర్ 1'. విడుదలకు ముందు అందరి దృష్టి రిషబ్ శెట్టిపైనే ఉంది. దర్శకుడిగా, నటుడిగా ఆయన అద్భుతంగా నటించారు. అయితే, రుక్మిణి వసంత్ క్లైమాక్స్‌లో విలనిజంతో కూడిన నటనను అందించింది. మొదట ఆమెది కేవలం ప్రేయసి పాత్ర అని ప్రేక్షకులు భావించినప్పటికీ, ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్‌లలో అసలు రంగు బయటపడుతుంది. ఆమె ఒక పవర్ హౌస్ పెర్ఫార్మర్‌గా ఇచ్చారు.
Also Read: Year Ender 2025: ఖాన్‌లు, కపూర్‌లు కాదు... బాలీవుడ్‌లో ఈ ఏడాది అదరగొట్టిన హీరోలు వీళ్ళే
'ది గర్ల్‌ఫ్రెండ్'లో రష్మిక మందన్న
రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. కాలేజీలో అందరూ ఇష్టపడే విక్రమ్‌ను భూమా ప్రేమిస్తుంది. తనను నియంత్రించే బంధంలో చిక్కుకుంటుంది. విక్రమ్ ఆధిపత్య ధోరణి పెరుగుతున్న కొద్దీ, భూమా తన గొంతు వినిపించడానికి & మానసిక వేధింపుల నుండి విముక్తి పొందడానికి బలవంతం అవుతుంది. రష్మిక తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. చాలా ప్రశంసలు అందుకుంది.

'బైసన్'లో ధ్రువ్ విక్రమ్
దర్శకుడు మారి సెల్వరాజ్ రూపొందించిన సినిమా 'బైసన్'. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ధ్రువ్ విక్రమ్ హీరో. ఆయన తాను కేవలం ఒక స్టార్ కిడ్ మాత్రమే కాదని, శక్తివంతమైన నటుడని నిరూపించుకున్నాడు. ఆయన కళ్ళతో నటించిన సన్నివేశాలు ఉన్నాయి. 'బైసన్'ను ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో బెస్ట్ అని చెప్పవచ్చు.

























