Discount On Cars: ఈ 4 కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు బెనిఫిట్
Tata Punch Discount Price | కొత్త సంవత్సరానికి ముందు కార్ల కంపెనీలు పాత మోడళ్ల స్టాక్ క్లియర్ చేయడంలో భాగంగా SUV కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. వివరాలు తెలుసుకోండి.

Kia Seltos Discount Price | ఆటోమొబైల్ మార్కెట్లో ఈ ఏడాది ఎన్నో కొత్త మోడల్స్ కస్టమర్లను ఆకర్షించాయి. 2026 కోసం మరెన్నో కొత్త కార్ల మోడల్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో కంపెనీలు పాత మోడల్స్ స్టాక్‌ను క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నాయి. దీనివల్ల కస్టమర్లకు నేరుగా ధరలో ప్రయోజనం చేకూరుతోంది. ఎందుకంటే ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా వీటికి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు. ఏ SUVపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇక్కడ వివరాలు తెలుసుకుందాం.
స్కోడా కుషాక్ (Skoda Kushaq)
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జనవరి 2026లో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. అంతకుముందు, కంపెనీ ప్రస్తుత మోడల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. స్కోడా కుషాక్‌పై సుమారు రూ.2.50 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. స్కోడా వైపు నుంచి 3.25 లక్షల రూపాయల డిస్కౌంట్ వస్తుందని సమాచారం. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.61 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మహీంద్రా XUV700 (Mahindra XUV700)
మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టీజర్ ఇదివరకే విడుదల చేసింది. ఈ మహీంద్రా కారును XUV 7XO పేరుతో జనవరి 5, 2026న లాంచ్ చేయనున్నారు. అంతకుముందు అవుట్‌గోయింగ్ XUV700పై డీలర్ స్థాయిలో సుమారు రూ. 80 వేల డిస్కౌంట్ లభిస్తోంది. మహీంద్రా XUV700 ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.66 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
టాటా పంచ్ (Tata Punch)
టాటా మోటార్స్ చాలా కాలం నుంచి టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ మైక్రో SUVకి 2026లో అప్‌డేట్ వెర్షన్ కారు మార్కెట్లోకి రావచ్చు. పంచ్ ఫేస్‌లిఫ్ట్ రాకముందే, ప్రస్తుం టాటా పంచ్‌పై సుమారు 80 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.50 లక్షల నుంచి రూ. 9.30 లక్షల మధ్య ఉంది.
కియా సెల్టోస్ (Kia Seltos)
కియా తన పాపులర్ SUV సెల్టోస్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం కియా సెల్టోస్‌పై కంపెనీ రూ. 1.60 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో 40 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి ఉంది. ఈ కారు ధర 10.79 లక్షల రూపాయల నుంచి టాప్ మోడల్ ధర రూ. 19.81 లక్షల వరకు ఉంటుంది.






















