తెలుగులో రష్మిక బెస్ట్ మూవీస్... స్టార్ అవ్వడానికి రీజన్ తెల్సా?

రష్మిక పాన్ ఇండియా క్రష్మిక కావడానికి రీజన్ తెలుగు సినిమాలు, టాలీవుడ్‌లో పాపులారిటీ.

తెలుగులో పాపులారిటీ తెచ్చిన, టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ ఇచ్చిన తెలుగులో రష్మిక బెస్ట్ మూవీస్ తెల్సా?

'గీత గోవిందం'... తెలుగులో రష్మికకు ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఒక్కసారిగా ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసిన సినిమా.

'గీత గోవిందం' కంటే ముందు తెలుగులో రష్మిక నాగశౌర్య 'ఛలో' చేసింది. అదీ హిట్టే. 

'ఛలో', 'గీత గోవిందం' విజయాలకు 'దేవదాసు', 'డియర్ కామ్రేడ్' బ్రేకులు వేశాయి. దేవదాసులో పోలీస్ గెటప్ ట్రోల్ అయ్యింది. 

'సరిలేరు నీకెవ్వరు'తో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఛాన్స్ అనుకుంది రష్మిక. అది కమర్షియల్ హిట్. 

'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వచ్చిన నితిన్ 'భీష్మ' సైతం రష్మికకు మంచి విజయం అందించింది.

'పుష్ప: ది రైజ్' విజయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రష్మికను పాన్ ఇండియా స్టార్ చేసింది. 

'పుష్ప' తర్వాత వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా మాత్రం రష్మికకు నిరాశ మిగిల్చింది.

హీరోయిన్ కాకపోయినా... 'సీతా రామం'తో నటిగా రష్మిక మంచి విజయం అందుకుంది. 

తమిళ డబ్బింగ్ 'వారసుడు', హిందీ డబ్బింగ్ 'యానిమల్' సైతం తెలుగులో మంచి వసూళ్లు రాబట్టాయి.

ఇప్పుడు రష్మిక 'పుష్ప 2' విడుదల కోసం వెయిట్ చేస్తోంది. ఆ సినిమా హిట్ మీద నమ్మకంగా ఉంది. 

ధనుష్ 'కుబేర', హిందీలో సల్మాన్ 'సికిందర్', 'చవ్వా', తమిళ - తెలుగు సినిమాలు 'రెయిన్ బో', 'గర్ల్ ఫ్రెండ్' చేస్తోంది రష్మిక.