హీరోగా పనికి రాడని ట్రోల్ చేశారు... కట్ చేస్తే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు

ట్రోలింగ్ ఇప్పుడు ఎక్కువైంది. సోషల్ మీడియా వచ్చాక! కానీ, ఈ హీరో 20 ఏళ్ళ క్రితమే ట్రోలింగ్ ఫేస్ చేశాడు. 

మొదటి సినిమాతో హీరోగా పనికి రాడని విమర్శలు ఫేస్ చేశాడీ హీరో. దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని లుక్స్ మీద వర్క్ చేశాడు.

'గంగోత్రి'లో అల్లు అర్జున్ లుక్స్, ఆయన యాక్టింగ్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. 

రెండో సినిమా 'ఆర్య'తో డ్యాన్స్ పరంగా అందరితో ఫుల్ మార్క్స్ వేయించుకుని ఒక మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్

బన్నీ, దేశముదురు, బద్రీనాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు అల్లు అర్జున్

లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్, తర్వాత కాలంలో లుక్స్ అంటే బన్నీలా ఉండాలనే పేరు తెచ్చుకున్నాడు. 

'పుష్ప: ది రైజ్'తో నేషనల్ సక్సెస్ కొట్టడమే కాదు... ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు  అందుకున్నాడు బన్నీ.

'పుష్ప: ది రూల్'తో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవల్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

'పుష్ప 2' తర్వాత ఎవరి డైరెక్షన్లో బన్నీ సినిమా చేస్తాడని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.