'గమ్యం'... అల్లరి నరేష్ కెరీర్‌లో మరువలేని సినిమా. బైకులు దొంగతనం చేసే వ్యక్తి గాలి శీనుగా మొదట నవ్వించినా... చివరలో ఏడిపించేశారు. ఆయన డెత్ సీన్ కంటతడి పెట్టిస్తుంది.
కామెడీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న నరేష్... మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ చేసిన సినిమా 'నాంది'. సాధారణ యువకుడిగా చింపేశారు. మామూలుగా చేయలేదు.
హీరోగా బిజీగా ఉన్న సమయంలో రవితేజ స్నేహితుడిగా 'శంభో శివ శంభో' చేశారు. చెవికి దెబ్బ తగిలిన తర్వాత ఆయన నటన నెక్స్ట్ లెవల్. ఎవరి ప్రేమ కోసం అయితే తన వినికిడి పోగొట్టుకున్నారో, వాళ్లు విడిపోయినప్పుడు 'చంపేద్దాం' అని చెప్పే సన్నివేశంలో కోపం చూపిస్తారు. అది ఎంతో మంది ఫెవరేట్ సీన్.
కామెడీ రోల్స్ కంటే ముందు నటుడిగా నరేష్ చేసిన ప్రయోగం 'ప్రాణం'. 'నిండు నూరేళ్ళ సావాసం' సాంగ్ ఇప్పటికీ వినబడుతుంది. కమర్షియల్ సక్సెస్ లేకున్నా నరేష్ ఫిల్మోగ్రఫీ, ప్రేక్షకుల హృదయాల్లో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
హీరోగా కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు నటుడిగా నరేష్ చేసిన మరో ప్రయోగం 'లడ్డు బాబు' సినిమా. ఆయన నుంచి ప్రేక్షకులు కామెడీ ఆశించడంతో ఆ సినిమా ఆడలేదు. కానీ, నటుడిగా అందులో నరేష్ కొత్తగా కనిపిస్తారు.
మహేష్ బాబు 'మహర్షి' సినిమాలోనూ అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర చేశారు. అది కథను, హీరో ఆలోచనలను మలుపు తిప్పే పాత్ర. అందులో కామెడీ ఉంటుంది కానీ ఒక దశ తర్వాత కామెడీతో కంటే ఆయనలో నటుడు కనిపిస్తాడు.
కింగ్ నాగార్జున 'నా సామి రంగ'లోనూ నరేష్ నటించారు. అందులోనూ కామెడీ నుంచి ఎమోషనల్ టర్న్ తీసుకునే క్యారెక్టర్ చేశారు. చివరలో ఆయన డెత్ సీన్ కంట తడి పెట్టిస్తుంది.
'నాంది' తర్వాత నరేష్ చేసిన సినిమాల్లో 'మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' సైతం సీరియస్ రోల్స్ ఉన్నవే. కమర్షియల్ విజయాలు పక్కన పెడితే... నటుడిగా తన నుంచి ఛేంజ్ చూపిస్తున్నారు.
'బచ్చలమల్లి' సినిమాతో డిసెంబర్ 20, 2024న థియేటర్లలోకి వస్తున్నారు నరేష్. ఆ సినిమాలో ఆయనది సీరియస్ రోల్ అని అర్థం అవుతుంది. మరి, రిజల్ట్ ఎలా ఉంటుందో? సినిమా ఎలా ఉంటుందో చూడాలి.