జూనియర్ ఆర్టిస్టుగా సత్యదేవ్ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా?

సత్యదేవ్ స్క్రీన్ మీద కనిపించిన మొదటి సినిమా 'డార్లింగ్'. అందులో ప్రభాస్ ఫ్రెండ్ రోల్ చేశారు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో మహేష్ బాబు స్నేహితుడిగానూ సత్యదేవ్ కనిపించారు.

పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది'లో అయితే ప్రణీతను కిడ్నాప్ చేసే గ్యాంగులో ఒకరిగా చిన్న రోల్ చేశారు.

వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాలోనూ రావు రమేష్ వెనుక గ్యాంగులో సత్యదేవ్ కనిపిస్తారు. 

నారా రోహిత్ 'అసుర'తో పాటు 'మైనే ప్యార్ కియా'లో కాస్త కీలక పాత్రలు చేశారు సత్యదేవ్. 

'జ్యోతిలక్ష్మి'ని సత్యదేవ్ (Satyadev First Movie As Main Lead)ను హీరో చేశారు పూరి జగన్నాథ్.

'జ్యోతిలక్ష్మి' తర్వాత హీరోగా 'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'తిమ్మరుసు', '47 డేస్' వంటివి చేశారు.

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో విలన్ రోల్ చేయడం సత్యదేవ్ కెరీర్ లో మెమరబుల్ మూమెంట్.

హిందీలో అక్షయ్ కుమార్ 'రామ్ సేతు'లో ఆంజనేయ పుష్పకుమారన్ (హనుమంతుని) రోల్ చేశారు సత్యదేవ్.