పుష్ప 2 ట్రైలర్‌లో అల్లు అర్జున్ ఎన్ని కాస్ట్యూమ్స్‌లో కనిపించారో గమనించారా?

స్టైల్ విషయంలో తగ్గేదే లే అంటారు అల్లు అర్జున్. మరి, 'పుష్ప 2'లో ఆయన స్టైల్స్ ఎలా ఉన్నాయో చూడండి. 

'పుష్ప 2' సినిమా ఫస్ట్ లుక్... గంగమ్మ జాతరలో చీర కట్టిన పుష్పరాజ్... మరో ఫైటులోనూ సూట్ మీద చీర వేశారు. 

ఎర్రచందనం డీల్ కోసం జపాన్ వెళ్లినప్పుడు ఆ దేశ దుస్తుల్లో... హెలికాప్టర్ ఫైటులో సూట్ వేసి...

పోర్టు ఫైటులో లుంగీ మీద కోట్ వేశారు అల్లు అర్జున్. సముద్రంలో దిగి పైకి లేచిన తర్వాత లుక్!

శ్రీలీలతో స్పెషల్ సాంగులో అల్లు అర్జున్ లుక్ చూశారా? కాషాయరంగు కలర్ సూట్ డ్రస్ వేశారు. 

ఇంట్లో భార్య శ్రీవల్లి దగ్గర బనియన్ లో పుష్పరాజ్... బయటకు వెళ్ళేటప్పుడు షర్టులో!

శంఖం పూరించిన పుష్పరాజ్... భక్తితో వెంకన్నను కొలవడానికి కావచ్చు, ప్రత్యర్థుల మీద యుద్ధానికి కావచ్చు.

అన్నసంతర్పణ సమయంలో వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ డ్రస్ లో అల్లు అర్జున్. బహుశా పూజ తర్వాత అయ్యి ఉంటుంది. 

హెలికాప్టర్ నుంచి దిగుతున్న సమయంలో మాలధారణ వంటి దుస్తుల్లో అల్లు అర్జున్ కనిపించారు. 

అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్‌ మాత్రమే కాదు... ఆ బెల్ట్, వాచ్, సిగార్ కూడా హైలైట్ అవుతోంది.

డిసెంబర్ 4న ఓవర్సీస్‌లో, 5న ఇండియాలో 'పుష్ప 2' రిలీజ్ అవుతోంది.