కన్నడ హీరోతో బ్రేకప్... రౌడీ బాయ్‌తో లవ్... కట్ చేస్తే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!

తెలుగులో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యే టైంకి కన్నడ హీరోతో ప్రేమలో పడింది ఈ అమ్మాయి.

తెలుగులో సక్సెస్ వచ్చాక కన్నడ హీరోతో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది.

కన్నడ హీరోకు బ్రేకప్ చెప్పడానికి తెలుగు హీరోతో లవ్ ఎఫైర్ రీజన్ అని టాక్. 

రీసెంట్‌గా 'నేను ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నానో అందరికీ తెలుసు' అంటూ పబ్లిక్ స్టేజి మీద చెప్పింది.

ఆ అమ్మాయి ఎవరో అర్థమైంది కదూ... అవును, రష్మిక మందన్నా. ప్రజెంట్ పాన్ ఇండియా సెన్సేషన్.

రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసిన రష్మిక, విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిందని టాక్.

విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్టు అఫీషియల్ గా చెప్పలేదు కానీ అది ఓపెన్ సీక్రెట్.

పుష్ప, ఇంకా హిందీ సినిమాలతో ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది రష్మిక.

డిసెంబర్ 2024లో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చని ఫిలిం నగర్ టాక్.