Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Bigger Thighs and Longevity : తొడలు సన్నగా ఉండడం కంటే లావుగా ఉండేవారు ఎక్కువకాలం బతుకుతారని తాజా అధ్యయనం వెల్లడించింది. మరి దీనిగురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

- అంతర్జాతీయ మెటా విశ్లేషణ తొడ చుట్టుకొలత, దీర్ఘాయువును అనుసంధానించింది.
- ప్రతి 5 సెం.మీ. పెరుగుదల మరణ ప్రమాదాన్ని 18% తగ్గిస్తుంది.
- తొడలోని కండర ద్రవ్యరాశి దీర్ఘాయువుకు కీలకమని నిపుణులు తెలుపుతున్నారు.
Larger Thighs Linked to Lower Risk of Death : సాధారణంగా తొడలు లావుగా లేదా పెద్దగా ఉంటే.. దానిని అధిక కొవ్వుగా చూస్తారు. అందుకే వాటిని తగ్గించుకునేందుకు తెగ కసరత్తులు చేస్తారు. జిమ్‌కి వెళ్తూ.. డైట్ కూడా ఫాలో అవుతారు. కానీ ఒక అంతర్జాతీయ మెటా విశ్లేషణ ఈ ఆలోచనపై భిన్నమైన దృక్పథాన్ని సూచిస్తోంది. దాదాపు 25,000 మంది నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి.. తొడ చుట్టుకొలతకు, దీర్ఘాయువుకు మధ్య ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది.
నివేదికల ప్రకారం.. తొడ చుట్టుకొలతలో ప్రతి 5 సెంటీమీటర్ల పెరుగుదల.. ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదాన్ని 18 శాతం తగ్గిస్తుంది. అయితే కేవలం తొడల పరిమాణం పెంచుకున్నంత మాత్రాన ఆయుర్దాయం కూడా దానంతట అదే పెరుగుతుందని అనుకుంటే పొరపాటే. తొడల నిర్మాణం, ముఖ్యంగా వాటిలోని కండరాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
Also Read : ఆరోగ్యంగా ఉంటూ ఆయుష్షు పెంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. వాటిని దూరంగా ఉంచండి
25 వేలమంది డేటాలోని ఇంట్రెస్టింగ్ విషయాలు..
ఈ అంతర్జాతీయ మెటా-విశ్లేషణలో దాదాపు 25,000 మంది పాల్గొన్నవారి డేటా చేర్చారు. తొడ చుట్టుకొలతలో ప్రతి 5 సెంటీమీటర్ల పెరుగుదల ఉన్నవారిలో.. ఏ కారణం వల్ల అయినా వచ్చే మరణ ప్రమాదాన్ని తగ్గించడంతో ముడిపడి ఉందని ఈ డేటా తెలిపింది. దీని అర్థం ఏంటంటే.. పెద్ద తొడ చుట్టుకొలత ఉన్నవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం ఒక సహసంబంధమేనట. కాబట్టి దీనిని ప్రత్యక్ష కారణం లేదా ఫలితంగా చూడలేము. ఎందుకంటే తొడ పరిమాణం అనేది కండరాలు, కొవ్వు, ఎముకలతో సహా అనేక కారకాలతో ప్రభావితం అవుతుంది. అందుకే ఒక వ్యక్తి ఆరోగ్యం లేదా దీర్ఘాయువు గురించి కేవలం తొడ వెడల్పు లేదా ఆకారం ఆధారంగా కన్ఫార్మ్ చేయలేము.
తొడలు పెద్దగా అవ్వడంలో కండరాల పాత్ర
యూకేలోని కింగ్స్ కాలేజ్ లండన్‌లో వృద్ధాప్యం, ఆరోగ్యం ప్రొఫెసర్ అయిన క్లైర్ స్టీవ్స్ ప్రకారం.. తొడలోని మూడు ప్రధాన రకాల కణజాలాలలో కండర ద్రవ్యరాశి ఆరోగ్యం, దీర్ఘాయువుతో బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. తొడ పరిమాణం కేవలం కొవ్వుపై మాత్రమే ఆధారపడి ఉండదు. కండర ద్రవ్యరాశి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.నడవడం, పరుగెత్తడం, శారీరక శ్రమను కొనసాగించడం వంటి రోజువారీ కార్యకలాపాలలో బలమైన కాలి కండరాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. అందుకే తొడ కండరాలను మొత్తం ఫిట్‌నెస్‌కు సూచికగా పరిగణించవచ్చని తెలిపారు.
Also Read : మధుమేహమున్నా.. ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెంచుకోవాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మెటా-విశ్లేషణలో దీర్ఘాయువుతో సంబంధం చూపిన వ్యక్తుల తొడలలో బహుశా ఎక్కువ కండర ద్రవ్యరాశి ఉండి ఉంటుందని.. ఇది తొడ చుట్టుకొలత కూడా ఎక్కువగా ఉండటానికి దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కొవ్వు, కండరాలను ఒకటే కాదు..
పెద్ద తొడలు ఉండటం అందరికీ ఒకేలా ఉండదని అర్థం చేసుకోవడం ముఖ్యం. కొందరి తొడలు కండరాల ద్రవ్యరాశి వల్ల పెద్దగా ఉండవచ్చు. మరికొందరివి అధిక కొవ్వు కారణంగా అలా ఉండవచ్చు. కాబట్టి తొడ చుట్టుకొలతను కొలవడం ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని నిర్ధారించలేము. ఈ అధ్యయనంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది కేవలం తొడల పరిమాణంపై కాకుండా వాటిలోని కండరాల పాత్రపై దృష్టి పెట్టింది. అందుకే నిపుణులు తొడలను కేవలం పెద్దవి లేదా సన్ననివి అని వర్ణించకుండా.. వాటి బలం, పనితీరును ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
Also Read : పని ఒత్తిడితో నిద్రను దూరం చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. లేకుంటే ఆయుష్షు తగ్గిపోద్ది
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















