Longevity Tips : ఆరోగ్యంగా ఉంటూ ఆయుష్షు పెంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. వాటిని దూరంగా ఉంచండి
Longevity Lifestyle : బతుకున్నంత కాలం హెల్తీగా ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే హెల్తీగా ఉంటూ ఆరోగ్యాన్ని ఎలా మెరుగు చేసుకోవాలో.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Long Life and Increase Lifespan : ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కాబట్టి ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించినా.. ఆరోగ్యాన్ని మాత్రం కొనలేరు. అలా అని ఆస్తిని సంపాదించకూడదని కాదు.. హెల్తీగా ఉండడమని ముఖ్యమని చెప్పడమే ఉద్దేశం. మీ ఆయుష్షును పెంచుకోవాలన్నా.. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఫోకస్ చేయాలి. అమరుడిగా ఉండడమనేది ఎవరికీ సాధ్యం కాదు. కానీ.. ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం హెల్తీగా బతికేయొచ్చు. మరి హెల్తీగా బతకడానికి లైఫ్స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
లైఫ్‌స్టైల్ సీక్రెట్స్
బరువు : హెల్తీగా ఉండడంలో ముఖ్యపాత్ర పోషించేంది బరువే. కాబట్టి వీలైనంత త్వరగా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. లేకుంటే గుండె సమస్యలు పెరుగుతాయి. డయాబెటిస్, పలురకాల క్యాన్సర్ వచ్చే అవకాశముంది. బరువు అదుపులో ఉంటే చాలా ఆరోగ్యసమస్యలు దూరమవుతాయి.
డైట్ : తినే ఆహారంపై ఫోకస్ పెట్టండి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌పై ఫోకస్ చేయండి. పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్, పప్పులు తీసుకోండి. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్‌ను నాన్వెజ్నుంచి తీసుకోవచ్చు. ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే.. అంత హెల్తీగా ఉంటారు.
వ్యాయామం : వారానికి కనీసం 150 నిమిషాలు అయినా ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ చేయొచ్చు. స్ట్రెచ్‌లు చేయొచ్చు. యోగా ఆసనాలు ట్రై చేయవచ్చు. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండే పనులు ఏవైనా చేస్తూ ఉంటే.. మెటబాలీజం పెరుగుతుంది. వయసు పెరిగినా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.
స్మోకింగ్ : మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే ఇప్పుడే మానేయండి. ఎందుకంటే సిగరెట్ వృద్ధాప్యఛాయలను ముందుగానే తెచ్చేస్తుంది. గుండె సమస్యలను, క్యాన్సర్ ప్రమాదాలను రెట్టింపు చేస్తుంది.
మద్యపానం : ఆల్కహాల్‌ని అకేషనల్‌గా లేదా చిల్ అవ్వడానికి అప్పుడప్పుడు లిమిట్లో తీసుకుంటే పర్లేదు. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. కానీ ఎక్కువ తాగే అలవాటు మంచిది కాదు. మీరు ఇప్పటికే వ్యసనం అనే దానిలో ఉంటే.. వీలైనంత వరకు తగ్గించేయండి.
నిద్ర : నిద్రను సర్వరోగనివారిణి అని చెప్పొచ్చు. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోండి. ఇది మీ శరీరాన్ని రిపైర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వయసు పెరిగినా హెల్తీగా ఉండడంలో సహాయ పడుతుంది.
ఒత్తిడి : ఒత్తిడి ఎక్కువగా ఉంటే త్వరగా ముసలివాళ్లైపోతారట తెలుసా? కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోండి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు మంచి ఫలితాలు ఇస్తాయి. మైండ్ ప్రశాంతంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు.
అదనపు చిట్కాలు ఇవే
నెగిటివ్ ఆలోచనలు : బ్రైయిన్ ఖాళీగా ఉంటే అనవసరమైనవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు వీలైనంత బిజీగా ఉంచుకోండి. బుక్స్ చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వంటివి చేయొచ్చు.
హెల్త్ చెకప్ : రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఆరోగ్యానికి, అందానికి కూడా నిపుణులను కలిసి వారి అభిప్రాయాలను తీసుకోండి. డైట్‌ని కూడా నిపుణుల నుంచి తీసుకుంటే మరీ మంచిది. ఇవన్నీ సమస్యలు రాకుండా హెల్త్‌ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి.
హైడ్రేషన్ : హైడ్రేషన్ ఈజ్ ద కీ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యంగా, యాక్టివ్‌గా, అందంగా ఉండాలంటే.. వీలైనంత నీటిని తాగండి.
జెనిటిక్స్
చాలామందికి తెలియని విషయమేంటి అంటే.. లైఫ్‌స్టైల్‌తో పాటు కొందరిని జెనిటిక్స్ కూడా నెగిటివ్‌గా ప్రభావితం చేస్తాయి. అలాంటి వారు నిపుణుల సలహా తీసుకుని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారో తెలుసుకోవాలి.
ఈ రొటీన్ లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటే మీరు హెల్తీగా ఆయుష్షును పెంచుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత ఫలితాలు మారుతూ ఉంటాయి.
Also Read : మెంటల్ హెల్త్‌కి ఇవే రెడ్ ఫ్లాగ్స్.. ఈ 7 లక్షణాలు మీలో గుర్తిస్తే, ఈ 5 టిప్స్ ఫాలో అయిపోండి..






















