అన్వేషించండి

Mental Health Red Flags : మెంటల్ హెల్త్​కి ఇవే రెడ్ ఫ్లాగ్స్.. ఈ 7 లక్షణాలు మీలో గుర్తిస్తే, ఈ 5 టిప్స్ ఫాలో అయిపోండి..

Recognize the Red Flags : మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మీలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి గుర్తించి.. రొటీన్​ని సెట్ చేసుకుంటే.. త్వరగా మీరు వాటినుంచి బయటపడగలుగుతారు. 

Mental Health Alert : మెంటల్ హెల్త్ అనేది ఈ రోజుల్లో అందని ద్రాక్ష అయిపోతుంది. మన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి.. మానసికంగా కృంగిపోతున్నారు. ఇలా మీరు మెంటల్​గా డిస్టర్బ్​గా ఉన్నప్పుడు మీ శరీరంలో, రోజువారి చేసే పనుల్లో కొన్ని మార్పులు చూస్తారు. అవేంటో తెలుసుకొని.. మీ కండీషన్​ని అర్థం చేసుకొని.. వాటినుంచి బయటపడేందుకు ఏమి ఫాలో అవ్వాలో రొటీన్​ని సెట్ చేసుకోవాలి. 

మానసికంగా మీరు హెల్తీగా లేకుంటే అది మిమ్మల్ని అనేక మార్గాల్లో కృంగదీస్తుంది. ఆరోగ్యం నుంచి.. మీరు చేసే పనుల్లో.. మీ ప్రమేయం లేకుండానే ఇబ్బందులు పడతారు. అందుకే వీలైనంత తొందరగా మీ బాడీ ఇచ్చే సంకేతాలను గుర్తించి.. వాటిని ఓవర్​ కామ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ మెంటల్ హెల్త్ పాడైందని చెప్పడానికి తెలిపే సంకేతాలు ఏంటి? వాటిని అధిగమించేందుకు ఏమి ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. 

మానసిక ఆరోగ్యానికి ఇవే రెడ్ ఫ్లాగ్స్

నిద్ర : మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మీరు బాగా ఎక్కువగా పడుకుంటారు. ఎప్పుడు నిద్ర కావాలనే ఫీల్​లో ఉంటారు. లేదంటే అస్సలు నిద్ర ఉండదు. ఎంత ట్రై చేసినా.. ఎన్ని టిప్స్ ఫాలో అయినా మీకు సరైన నిద్ర ఉండదు. 

అలసట : మీరు ఏ పని చేసినా ఏ పని చేయకున్నా అలసిపోతూ ఉంటారు. ఓపిక, శక్తి ఉండదు. ఖాళీగా కూర్చొని ఉన్నా కూడా మీకు అలసిపోయినా ఫీలింగ్ వస్తుంది. 

ఫుడ్ : మానసికంగా ఆరోగ్యం బాలేనప్పుడు మీరు తినే అలవాట్లలో మార్పులు ఉంటాయి. ఒకటి అస్సలు తినకపోవడం లేదంటే ఎక్కువ తినడం. ఫుడ్ క్రేవింగ్స్ పెరిగిపోయి స్ట్రెస్​లో ఎక్కువగా తింటారు. లేదా అస్సలు ఫుడ్ తినకుండా ఉంటారు. 

తలనొప్పి : తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరంలోని అన్ని భాగాలు నొప్పి కలిగిన ఫీల్ వస్తుంది. అవి రావడానికి రీజన్ లేకున్నా నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 

ఫోకస్ : పని మీద ఫోకస్ చేయలేరు. సింపుల్​గా చేయాల్సిన పనులను కూడా పూర్తి చేయడం కష్టంగా ఫీల్ అవుతారు. 
మూడ్ స్వింగ్స్ : మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి. దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అప్పుడే సంతోషంగా ఉంటారు. అప్పుడే బాధపడుతూ ఉంటారు. 

బాధ : ఇది అన్నింటికంటే వరస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు మానసికంగా కృంగిపోతారు. బాధపడతారు. హోప్​లెస్​గా ఫీల్ అవ్వొచ్చు. బాధని ఎవరితో షేర్ చేసుకోవాలో.. ఎలా షేర్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. 

ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని అర్థం. వీటి గురించి ఒకరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీలోని మార్పులు మీరే గుర్తించగలుగుతారు. కానీ వాటిని దూరం చేసుకోవడం కూడా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీరు వాటిని అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు.

ఫాలో అవ్వాల్సిందే.. 

షెడ్యూల్ : నిద్ర వచ్చినా రాకున్నా టైమ్​కి పడుకోవడం, ఆకలి వేసినా, వేయకున్నా టైమ్​కి తినడం, వర్క్ చేస్తూ ఉంటే.. బ్రేక్స్ తీసుకోవడం చేయండి. వీటిని మీకు నచ్చినా.. నచ్చకున్నా ఫాలో అవుతూ ఉండండి. మీరు వీటిని రెగ్యులర్​గా చేయడం వల్ల మీ బాడీ వీటిని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 

వ్యాయామం : వ్యాయామం ఎక్కువ చేయమనట్లేదు. వాకింగ్ చేయండి. బాడీ స్ట్రెచ్ చేయండి. యోగా చేయండి. ఫిజికల్​గా యాక్టివ్​గా ఉండండి. వీటివల్ల శరీలంలో ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మూడ్ రిలాక్స్ అవుతుంది. మెడ, భుజాల దగ్గర మసాజ్ చేసుకోండి. ఇవి టెన్షన్​ని దూరం చేస్తాయి. 

బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​ : రోజూ పదినిమిషాలు డీప్ బ్రీత్ ఎక్సర్​సైజ్ చేయండి. ఇది చాలా సింపుల్ అయినా కూడా ఎఫెక్టివ్ ఫలితాలు ఇస్తుంది. మీ నరాలకు ప్రశాంతతను అందించి.. తలనొప్పిని దూరం చేస్తుంది. జీర్ణ సమస్యలు సైతం తగ్గుతాయి. 

జర్నలింగ్ : మీ ఆలోచనలు, ఫీలింగ్స్, రోజు చేస్తున్న పనుల గురించి ఓ డైరీ రాయండి. వీటివల్ల మీరు ఏ విషయాలకు ట్రిగర్ అవుతున్నారు. ఏ విషయాలు మిమ్మల్ని హ్యాపిగా ఉంచుతున్నాయి. మీరు చేయాల్సిన పనులేంటో.. చేయకూడని పనులేంటో తెలుస్తుంది. 

సపోర్ట్ : మీకు అవసరమనుకుంటే ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ లేదా మీకు పాజిటివిటీని ఇచ్చే వ్యక్తులతో మాట్లాడండి. లేదా నిపుణులను కన్సల్ట్ అవ్వండి. ఎవరితో మాట్లాడినా ఇబ్బంది పడతాను అనిపిస్తే.. మీకు నచ్చిన పని చేయండి.

ఈ టిప్స్ మీకు మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా.. మీ లైఫ్​లో రెడ్ ఫ్లాగ్స్​ను గ్రీన్​ ఫ్లాగ్స్​గా మార్చగలవు. సెల్ఫ్​ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. మీకు కూడా అది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించండి. మీరు బాగుంటేనే.. మీ లైఫ్​ అందంగా మారుతుంది. ఏది మన చేతుల్లో లేదు అనుకునే బదులు.. మీ చేతుల్లో ఉన్న కొన్ని అంశాల్లో మార్పులు చేయండి.. అన్ని మీకు అనుకూలంగా మారుతాయి. 

Also Read :  ఊరికే టెన్షన్ పడుతున్నారా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి వెంకీమామ చెప్పిన ఈ 4 రూల్స్​ను ఫాలో అయిపోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
Billionaires: ఇండియాలో పెరిగిన బిలియనీర్ల సంఖ్య -   అంబాని, అదానీ..  నెంబర్ వన్ ఎవరో తెలుసా.. ?
ఇండియాలో పెరిగిన బిలియనీర్ల సంఖ్య - అంబాని, అదానీ.. నెంబర్ వన్ ఎవరో తెలుసా.. ?
Vallabhaneni Vamsi: వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Nara Lokesh Saves Life: నారా లోకేష్ చేసిన ఈ పని కళ్లు చెమర్చేలా చేస్తుంది - ఒకరి ప్రాణం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ?
నారా లోకేష్ చేసిన ఈ పని కళ్లు చెమర్చేలా చేస్తుంది - ఒకరి ప్రాణం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ?
Embed widget