అన్వేషించండి

Life Changing Rules : ఊరికే టెన్షన్ పడుతున్నారా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి వెంకీమామ చెప్పిన ఈ 4 రూల్స్​ను ఫాలో అయిపోండి

Stress Less : టెన్షన్, స్ట్రెస్ అనేవి ఈరోజుల్లో చాలా కామన్ విషయం. కానీ వీటిని ఎవరూ కామన్​గా తీసుకోరు. అయితే వీటిన దూరం చేసుకోవడానికి ఈ 4 రూల్స్ ఫాలో అయి చూడండి. 

Simple Rules for a Happier Life : The Rana Daggubati Show అమెజాన్ ప్రైమ్​లో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతుంది. రీసెంట్​గా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్​లో భాగంగా ఈ షోకి వచ్చిన వెంకటేష్ అండ్ మూవీ టీమ్ అంతా వచ్చారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే ఈ షోలో ఒత్తిడిని తగ్గించుకోవడంలో వెంకీమామ ఫాలో అయ్యే నాలుగు రూల్స్ కూడా చెప్పాడు. దీనిని ఎవరూ ఫాలో అయినా మెంటల్ స్ట్రెస్ తగ్గి.. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇంతకీ ఆ నాలుగు రూల్స్ ఏంటో ఒత్తిడిని దూరం చేసుకోవడంలో ఇవి ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం. 

వెంకీ ఆసనం అనుకునేరు.. 

ఎఫ్​ 2 సినిమాలో వెంకటేషన్ తన స్ట్రెస్​ని తగ్గించుకోవడానికి ఓ ఆసనం వేస్తారు. ఇది కూడా అలాంటిదే అనుకుంటే పొరపాటే. వెంకీ రియల్​ లైఫ్​లో ప్రశాంతంగా ఉండడానికి ఫాలో అయ్యే నాలుగు రూల్స్ ఆ ఆసనానికి ప్రత్యేకం. సినిమా రిలీజ్​ సమయంలో టెన్షన్ ఉంటుందా నాన్న అని అడిగితే.. వెంకీ నో అని చెప్పి.. 4 రూల్స్ చెప్పారు. అవేంటంటే.. 1. Exert, 2. Submit, 3. Exit, 4. Accept. ఈ నాలుగు ఫాలో అయితే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు వెంకటేష్. 

1. కష్టపడడం (Exert)

ఏ పని చేసినా.. దానికి ఫిజికల్​గా, ఎమోషనల్​గా ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. దీనిలో మీరు 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి పని చేయాలి. పని చేసేప్పుడు ఎలాంటి Distraction లేకుండా.. మీరు ఎంత వరకు చేయగలరో.. ఎంత మెరుగైన రిజల్ట్స్ ఇవ్వగలరో అంతా కష్టపడాలి. చేసే పనిలో ప్రాణం పెట్టి పనిచేయాలి. 

2. సమర్పించండం (Submit)

చేసిన పనిని కచ్చితంగా యూనివర్స్​కి సబ్మీట్ చేయాలి. అది సినిమా అయినా.. ఇతర వస్తువైనా, వ్యాపారమైనా.. ఏ రంగంలో ఏ పని అయినా.. చేసిన తర్వాత దానిని యూనివర్స్​కి సబ్​మీట్ చేయాల్సిందే. 

3. బయటకొచ్చేయాలి (Exit)

మీరు చేసిన పని మీ చేతి నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఇంక ఆ పని గురించి ఆలోచించకూడదు. ఏదైనా మీ చేతిని దాటి వెళ్లిపోయిందంటే.. మీరు మార్చేది, చేసేది ఏమి ఉండదు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ పని, ఆలోచనల నుంచి బయటకొచ్చేయాలి. 

4. అంగీకరించడం (Accept)

మీరు చేసిన పనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేయగలగాలి. మీరు చేయాల్సినంత పని చేశారు. మీకు ఎంత చేతనైందో అంత ప్రయత్నించారు. కొన్నిసార్లు మనం ఎంత ఎఫర్ట్​ పెట్టినా.. అనుకూలంగా రిజల్ట్స్ రాకపోవచ్చు. కాబట్టి రిజల్ట్ ఏది అయినా దానిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత చేసే పనిలో ముందు చేసిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండేలా చూసుకోవాలి. 

ఈ నాలుగు రూల్స్.. ఏ పనికి అయినా వర్తిస్తాయి. ఎగ్జామ్స్​కి కూడా ఈ రూల్స్ ఫాలో అయితే.. విద్యార్థులు కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ 4 రూల్స్ ఉద్యోగులు ఫాలో అయితే వారిలో ఒత్తిడి తగ్గుతుంది. చాలామంది వర్క్ విషయంలో చాలా స్ట్రెస్ తీసుకుంటారు. మొదటి రెండు రూల్స్​ని చాలామంది ఫాలో అవుతారు కానీ.. తర్వాతి రెండు రూల్స్​ని వదిలేస్తారు. అయితే ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది చివరి రెండు రూల్సేనని చెప్పారు వెంకటేష్. 

ఓ పనికి ఎఫర్ట్స్​ పెట్టి.. యూనివర్స్​కి సబ్మీట్ చేసిన తర్వాత దానిని నుంచి ఎలా బయటకు రావాలో చాలామందికి తెలియదని.. మరికొందరు వచ్చిన రిజల్ట్స్​ని యాక్సెప్ట్ చేయరని.. అదే అన్ని అనర్థాలకు దారి తీస్తుందని తెలిపారు. ఈ రూల్స్​ని ఫాలో అవ్వడానికి తనకి ఎన్నో ఏళ్లు సమయం పట్టిందని.. అంతా ఈజీగా దీనిని ఫాలో అవ్వలేమని.. యోగా, మెడిటేషన్ కచ్చితంగా హెల్ప్ చేస్తాయని తెలిపారు. 

Also Read : పేరెంట్స్ అలెర్ట్.. మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త, న్యూ రూల్స్​తో షాక్​ ఇవ్వబోతున్న గవర్నమెంట్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget