సింగిల్​గా ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. అవేంటంటే..

మీకు నచ్చిన నిర్ణయాలు.. నచ్చినప్పుడు.. నచ్చిన విధంగా తీసుకునే ఫ్రీడమ్ ఉంటుంది.

మీ కెరీర్​పై ఫోకస్ చేయగలుగుతారు. మీ ఇష్టాలకు అనుగుణంగా.. మీ గోల్స్​ని రీచ్​ అయ్యే అవకాశాలు ఎక్కువ.

కొత్త స్కిల్స్ నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాన్ఫిడెంట్​గా మీరు అనుకున్నది చేయగలుగుతారు.

ఇతరులపై అనవసరమైన ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు. వెల్తీగా ఉండొచ్చు.

మీకు నచ్చిన అంశాలపై మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు చేసుకోగలుగుతారు.

అనవసరమైన ఒత్తిడి ఉండదు. మీకు నచ్చిన నిర్ణయాన్ని ఎవరు జడ్జ్ చేసే ఛాన్స్ ఉండదు.

హెల్తీ బౌండరీలు మెయింటైన్ చేయవచ్చు. ఇది మెంటల్ వెల్​ బీయింగ్​కి మంచిది.

మీరు చేసే పనిని, హాబీలను, పర్సనల్ ప్రాజెక్ట్స్​ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫినిష్ చేయవచ్చు.

సోలో ట్రిప్స్​కి వెళ్లొచ్చు. ఫ్రెండ్స్​తో ఫ్యామిలీతో నచ్చినంత సేపు సమయాన్ని స్పెండ్ చేయవచ్చు.