Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) కంబ్యాక్ మాములుగా లేదు. విజయ్ హజారే ట్రోఫీలో ( Vijay Hazare Trophy ) బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.
అయితే స్టార్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఈ మ్యాచ్ లో పంజాబ్ తరపున బౌలింగ్ చేసాడు. క్రీజ్ లోకి రాగానే సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం మొదలైంది. బౌలింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ కు చుక్కలు చూపించాడు సర్ఫరాజ్. అభిషేక్ ఓవర్ లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాది 30 పరుగులు రాబట్టాడు.
ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 15 బంతుల్లోనేలో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా రికార్డు కెక్కింది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ 20 బంతుల్లో 62 పరుగులు చేసాడు. అందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.





















