Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఎవరు ఊహించని విధంగా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెట్ నిపుణులు కూడా కోహ్లీ నిర్ణయంతో షాక్ కు గురైయ్యారు. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ పై ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎదో ఒక విషయంపై చర్చ జరుగుతూనే ఉంది.
ఇప్పుడు టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ( Sanjay Manjrekar ) విరాట్ పై కామెంట్స్ చేసారు. విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం తనను చాలా నిరాశకు గురిచేసిందని అన్నారు. మంజ్రేకర్ మాట్లాడుతూ.. జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో హైయెస్ట్ పీక్స్ కు చేరుకుంటుంటే.. తన మనస్సు మాత్రం విరాట్ కోహ్లీ వైపు వెళుతోందని చెప్పారు.
రెండు రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. వన్డేలు మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నాడు. కోహ్లీ క్రికెట్‌లో చాలా ఈజీ ఫార్మాట్ ను ఎంచుకున్నాడని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. ఇలా విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై ఎదో ఒక చర్చ కొనసాగుతూనే ఉంది.





















