అన్వేషించండి

Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!

Shenlong Suezmax Mumbai Arrival: హుర్ముజ్‌ జలసంధి అనేది ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ వంటిది.  ప్రపంచంలోని మొత్తం ముడి చమురులో ఐదో వంతు ఈ చిన్న మార్గం గుండానే వెళ్లాలి.

Shenlong Suezmax Mumbai Arrival: పశ్చిమాసియాలో రాజుకున్న అగ్గి ప్రపంచాన్నే వణికిస్తోంది. ఎక్కడెక్కడో ట్రావెల్ చేస్తున్న నౌకలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఇలాంటి ఉద్రిక్తతలు వేళ సముద్ర మార్గాల్లో ప్రయాణం సాహసమే అని చెప్పాలి. ముఖ్యంగా అమెరికా- ఇజ్రాయెల్‌ దళాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్న కారణంగా హుర్ముజ్‌ జలసంధిని మూసేశారు. రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారతీయ కెప్టెన్ తన చాకచక్యంతో నిఘా కళ్లకు గంతలు కట్టి లక్ష టన్నుల ముడి చమురు ముంబై తీరానికి సురక్షితంగా చేర్చారు. ఈ సాహసయానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 

ఎవరా కెప్టెన్? ఏమిటా నౌక?

ముంబై పోర్టుకు చేరుకున్న ఈ భారీ నౌక పేరు షెన్‌లాంగ్‌సూయజ్‌మాక్స్‌. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్‌, సౌదీ అరేబియా నుంచి ముడి చమురును తీసుకొని ఇండియాకు బయల్దేరింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతోపాటు ఈ నౌకలో భారత్, పాకిసస్థాన్‌, ఫిలిప్పీన్స్‌కు చెందిన మొత్తం 29 మంది సిబ్బంది ఉన్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్రమాదకరమైన జలసంధిని దాటి భారత్‌కు చేరుకున్న మొదటి నౌక ఇదే. 

నిఘా కళ్లు కప్పి ఎలా వచ్చారు?

హుర్ముజ్‌ జలసంధి అనేది ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ వంటిది.  ప్రపంచంలోని మొత్తం ముడి చమురులో ఐదో వంతు ఈ చిన్న మార్గం గుండానే వెళ్లాలి. అయితే ప్రస్తుతం ఇరాన్ ఈ మార్గంలో వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. చైనాకు వెళ్లే నౌకలను తప్ప మిగిలిన ఏ నౌకను కూడా ఇక్కడి నుంచి వెళ్లనివ్వబోమని హెచ్చరించింది. 

ఇలాంటి పరిస్థితిలో కెప్టెన్ సంధు అద్భుతమైన ప్లాన్ వేశారు. మార్చి 1న సౌదీలోని రాస్‌తనురా పోర్టులో చమురును నింపుకున్న ఈ నౌక మార్చి 3న ప్రాణం మొదలు పెట్టింది. మార్చి 8 నాటికి హుర్ముజ్‌ జలసంధి వద్దకు చేరింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతం దాటే వరకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌, ట్రాన్స్‌ పాండర్లను కెప్టెన్ సంధు ఆపేశారు. దీని వల్ల సముద్రంలో నౌక ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. దీనినే నావీ భాషలో గోయింగ్ డార్క్ అంటారు. ఒక రోజు పాటు చీకట్లోనే ప్రయాణించి ప్రాణాపాయం ఉన్న ఆ ప్రాంతాన్ని దాటిన తర్వాత మర్చి 9న మళ్లీ సిగ్నల్ వ్యవస్థను ఆన్ చేశారు. అలా నిఘా రాడార్‌లకు దొరక్కుండా క్షేమంగా భారత్ చేర్చారు. 

ముంబై చేరుకున్న చమురు నౌక- ఊపిరి పీల్చుకున్న రిఫైనరీలు

బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ముంబై పోర్టుకు చేరుకున్న షెన్‌లాంగ్ నౌక, సాయంత్రం ఆరు గంటలకు తన బెర్త్‌కు చేరుకుంది. ముంబై పోర్ట్ ఆథారిటీ డిప్యూటీ కన్సర్వేటర్‌ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ ఈ నౌకలో 1, 35, 335 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉందన్నారు. 

ఈ చమురు అన్‌లోడ్ చేయడానికి సుమారు 36 గంటల సమయం పడుతుంది. ఇక్కడి నుంచి ఈ చమురు ముంబై తూర్పు ప్రాంతంలోని మాహుల్‌లో ఉన్న రిఫైనరీలకు చేరుతుంది. దేశంలో ఇంధన కొరత ఏర్పడుతున్న ఆందోళనలో ఉన్న భారత్‌కు, ఈ నౌక రాక పెద్ద ఊరటనిచ్చింది. 

మిగిలిన నౌకల పరిస్థితి ఏంటీ?

షెన్‌లాంగ్ క్షేమంగా వచ్చింది సరే, కానీ ఇంకా 28 భారతీయ జెండాతో ఉన్న నౌకలు ఆ ప్రమాదకర ప్రాంతంలోనే చిక్కుకుపోయి ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్‌ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి. అయితే యుద్ధం మొదలైన సమయంలో అక్కడ ఉన్న కొన్ని నౌకలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి. దేశ్‌ మహిమ, దేశ్ అభిమాన్, స్వర్ణ కమల్, విశ్వ ప్రేరణ, జగ్ విరాట్, జగ్‌ లోకేష్‌, ఎల్‌ఎన్‌జీసీ అసీమ్ అనే ఏడు నౌకలు అరేబియా సముద్రంవైపు వచ్చేయగా జగన్ లక్ష్యం అనే మరో నౌక అంగోలా దేశం వైపు వెళ్లింది. 

ప్రస్తుతం అక్కడ ఉన్న నౌకలు కొన్ని తమను తాము చైనా నౌకలుగా రాడార్లలో కనిపించేలా సిగ్నల్ మారుస్తూ బయటపడేందుకు యత్నిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ఆంక్షలు లేకపోయినా, కెప్టెన్లు తమ విచక్షణతో పరిస్థితులను బట్టి ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Strait of Hormuz: హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
PM Modi: మహిళల్ని విపక్షాలు అవమానించాయి.. ఎంతో ఆవేదన చెందాను - ప్రధాని మోదీ స్పీచ్ Watch Live
మహిళల్ని విపక్షాలు అవమానించాయి.. ఎంతో ఆవేదన చెందాను - ప్రధాని మోదీ స్పీచ్ Watch Live
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Chittoor Leopard: చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
Embed widget