Diabetes Tips : మధుమేహమున్నా.. ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెంచుకోవాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Diabetic Health : డయాబెటిస్ వస్తే లైఫ్ స్పాన్ తగ్గుతుందని అంటారు. అయితే మధుమేహమున్నా జీవితకాలాన్ని పెంచుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవేంటో చూసేద్దాం.

Increase Lifespan with Diabetes : డయాబెటిస్‌ని సైలెంట్ కిల్లర్ అంటారు. మధుమేహమున్నవారికి ఇది చాలా ప్రమాదమని అంటారు. అయితే మీరు కానీ.. మీ పేరెంట్స్ కానీ డయాబెటిస్తో ఇబ్బంది పడుతుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. తెలిసి తెలిసి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. వాటి వల్ల మధుమేహం కంట్రోల్లో ఉండడంతో పాటు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని.. జీవితకాలం పెరుగుతుందని చెప్తున్నారు.
మధుమేహం ఉన్నవారిలో షుగర్ స్పైక్స్ ఎక్కువగా ఉంటే అవి శరీరంలోని అవయవాలను డ్యామేజ్ చేస్తాయి. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ కలిసి మరణానికి దారి తీస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా కొన్ని టిప్స్ ఫాలో అయితే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ సూచనలు ఏంటో.. వాటిని ఫాలో అయితే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
భోజనంలో మార్పులు..
డయాబెటిస్ ఉన్నవారు అందరూ రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం తీసుకోవడం కుదరదు. కచ్చితంగా డైట్లో మార్పులు ఉండాలి. డైట్లో మిల్లెట్స్ ఉండేలా చూసుకోవాలి. అన్నం, చపాతీలు తీసుకోవడం తగ్గించాలి. వాటికి బదులు జొన్నలు, సజ్జలు వంటివి తీసుకోవచ్చు. వీటిలోని గ్లైసమిక్ లెవెల్స్ బ్లజ్లోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.
స్వీట్స్ క్రేవింగ్స్
డయాబెటిస్ ఉన్నవారు స్వీట్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. అయితే మీకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైనప్పుడు.. ముందు కడుపునిండా ఫుడ్ తీసుకుని అప్పుడు చిన్న స్వీట్ తినాలి. ఇప్పటికే కడుపు ఫుల్‌గా ఉండడం వల్ల మీరు ఎక్కువ స్వీట్ తినకుండా ఉండగలుగుతారు. అలాగే స్వీట్‌ని ఫైబర్ ఫుడ్‌తో కలిపి తీసుకుంటే మరీ మంచిది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్లో ఉంటాయి.
మీల్ ప్లాన్
కేవలం కార్బ్స్ మాత్రమే తీసుకుంటే డయాబెటిస్ ఉన్నవారి పరిస్థితి చేయి జారిపోతుంది. కాబట్టి మీరు రైస్‌తో పాటు ప్రోటీన్ సోర్స్ ఉండేలా చూసుకోవాలి. పెరుగు, కూరగాయాలను కార్బ్స్‌తో పాటు తీసుకోవాలి. నట్స్‌ని కూడా కలిపి తీసుకోవచ్చు. ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ ఉంటే హెల్తీ మీల్ని ప్లాన్ చేసుకోవాలి.
వాకింగ్..
భోజనం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాలు వాక్ చేయాలి. దీనివల్ల శరీరంలోని ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇవి బ్లడ్‌లోని షుగర్ స్పెక్స్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి.
మరిన్ని టిప్స్..
రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి. వైద్యులు సూచించిన మందులు ఉపయోగించాలి. అలాగే స్వీట్స్ క్రేవింగ్స్‌ని లేదా ఇతర అన్ హెల్తీ ఫుడ్స్‌ని హెల్తీ ఫుడ్స్‌తో భర్తీ చేయాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. కనీసం తేలికపాటి వ్యాయామం అయినా మంచిదే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ డయాబెటిక్స్‌కి ఉండాలి. దీనివల్ల స్ట్రెస్ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడే వారు ఈ సమస్యను ఓవర్ కామ్ చేయగలుగుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















