Eating Rules : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని తీసుకోవాల్సిన నియమాలివే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Eating Rules According to Ayurveda : ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగానూ, బరువును అదుపులోనూ ఉంచుకోగలుగుతారు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మంచిదో చూసేద్దామా?

Ayurvedic Eating Rules : ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారాన్ని ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీరు పెద్ద మార్పులేమి చేయాల్సిన అవసరం లేకుండా.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆయుర్వేదంలోని ఆహార నియమాలు పాటిస్తే చాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా కంట్రోల్ అవుతుంది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి? ఎలాంటి నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారో ఓసారి చూసేద్దాం.
కడుపు నిండుగా..
ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా 100 శాతం కాకుండా 60 నుంచి 70 శాతం మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల కడుపులో కాస్త స్పేస్ మిగులుతుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణమవుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. టాక్సిన్లు తగ్గుతాయి.
సరైన టైమ్ ఇదే
ఉదయం, రాత్రి కాకుండా.. మధ్యాహ్న భోజనం మాత్రమే హెవీగా ఉండేలా చూసుకోండి. ఉదయం, సాయంత్రం కేవలం శరీరానికి కావాల్సిన పోషకాలు లిమిటెడ్‌గా అందిస్తే సరిపోతుంది. కాబట్టి మార్నింగ్, ఈవెనింగ్ ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు. మధ్యాహ్నం మాత్రం శుభ్రంగా తినొచ్చు.
మంచిది కాదు..
రాత్రి భోజనం వీలైనంత త్వరగా ముగించాలి. లేట్ నైట్ డిన్నర్ అనేది అస్సలు మంచిది కాదు. రాత్రుళ్లు లేట్‌గా తినడం వల్ల శరీరంలోని అవయవాలకు విశ్రాంతి ఉండదు. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో బిజీగా ఉంటాయి. దీనివల్ల తగినంత నిద్ర, విశ్రాంతి ఉండదు.
ఆ మిస్టేక్ చేయొద్దు..
తీసుకునే ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా? అది అస్సలు మంచిది కాదు. కొందరు ఫుడ్ ఫ్రిడ్జ్‌లో ఉంచి.. వాటిని తినేప్పుడు మళ్లీ వేడి చేసుకుని తింటారు. అలా తినకూడదని చెప్తుంది ఆయుర్వేదం. ఫుడ్‌ని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినడం కంటే.. దానిని అస్సలు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఉదయం వండింది రాత్రి తినడం మంచిదే కానీ.. దానిని ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్లీ దానిని వేడి చేసుకుని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయని చెప్తున్నారు.
స్కిప్ చేసేయండి..
మీరు ముందుగా తీసుకున్న ఆహారం జీర్ణం కాలేదని అనిపిస్తే తర్వాత భోజనం చేయకపోవడమే మంచిది. ఫుడ్ జీర్ణం కాకుంటే ఎక్కువ తేనుపులు వస్తాయి. అలాంటప్పుడు మీరు ఫుడ్ స్కిప్ చేసి గోరువెచ్చని నీటిని తీసుకుంటే మంచిది. కుదిరితే శొంఠి పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే మరీ మంచిది.
ఫుడ్ వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిదట. ఇది మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. వండుకున్న వెంటనే ఫుడ్ తినేలా ప్లాన్ చేసుకోండి. ప్యాక్ చేసుకోగలిగే హాట్ బాక్స్‌లు ఉపయోగించవచ్చు. అంతేకానీ మళ్లీ వేడి చేసుకుని తినకూడదు. ఇవన్నీ శరీరానికి మంచిగా ఫుడ్‌ని అందించడంలో హెల్ప్ అవుతాయి. దీంతో మీరు హెల్తీగా, బరువు కంట్రోల్ అవుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















