అన్వేషించండి

Liver Cleansing Tips : కాలేయాన్ని సహజంగా ఇలా డీటాక్స్ చేసేయండి.. లివర్​ హెల్త్​ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్

Liver Health : కాలేయాన్ని కాపాడుకునేందుకు కచ్చితంగా డిటాక్స్ టిప్స్ ఫాలో అవ్వాలని అంటున్నారు నిపుణులు. సహజంగా దీనిని ఎలా క్లెన్సింగ్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

Tips for Maintaining Liver Health : శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపి.. పూర్తి ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలేయం కీ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఆహారం ద్వారా తీసుకున్న పోషకాలను, మెడిసన్స్​ను శరీరానికి అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. హార్మోనల్ సమస్యలను దూరం చేస్తుంది. మెటబాలీజాన్ని రెగ్యులేట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్​ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇలాంటి లివర్​ని హెల్తీగా చూసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సహజంగా లివర్​ డీటాక్స్ కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

లెమన్ వాటర్

మీ ఉదయాన్ని లెమన్ వాటర్​తో స్టార్ట్ చేయండి. గోరువెచ్చని నీటిలో తాజాగా పిండిన నిమ్మరసం కలిపి పరగడుపునే తాగండి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. లివర్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. 

ఆహారం..

కాలేయాన్ని శుభ్రం చేసుకునేందుకు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. లివర్​ ఫ్రెండ్లీ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలి. ఆకుకూరలు, వెల్లుల్లి, బీట్​రూట్, పసుపు వంటి వాటిని డైట్​లో చేర్చుకోవాలి. ఆరెంజ్, ద్రాక్షలు వంటి వాటిలో విటమిన్ సి ఉంటాయి. ఇవి కూడా లివర్​ హెల్త్​కి మంచివి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. లివర్​ని డిటాక్స్ చేసి.. మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటా ప్రాసెస్ చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. 

ఫాస్టింగ్.. 

వారంలో ఏదొక రోజు మీరు ఫాస్టింగ్ చేయండి. లేదా ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా ఉపవాసం చేయడం వల్ల లివర్​ డిటాక్స్​ అవ్వడంపై ఫోకస్ పెడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. లివర్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. 

వ్యాయామం

ఫిజికల్​ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. రోజూ వ్యాయామం చేయడం వల్ల కూడా లివర్ హెల్త్ మెరుగవుతుంది. నడక, యోగా, సైక్లింగ్ వంటివి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవి లివర్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి. సహజంగా కాలేయాన్ని డిటాక్స్ చేస్తాయి. ఒత్తిడి కూడా లివర్​పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది కాబట్టి.. యోగా, మెడిటేషన్ వంటివి చేయొచ్చు. 

హైడ్రేషన్ 

హైడ్రేషన్ అనేది లివర్​ హెల్త్​ని పూర్తిగా మెరుగుపరుస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగండి. దీనివల్ల లివర్ ఫిల్టర్ అవుతుంది. టాక్సిన్లను బయటకు పంపుతుంది. మెటబాలీజంని పెంచి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

దూరంగా ఉండండి.. 

ప్రాసెస్ చేసిన ఫుడ్​ని పూర్తిగా మానేస్తే మంచిది. లేదా లిమిట్​గా తీసుకోవాలి. ప్రిజెర్వేటివ్స్ ఉండే ఫుడ్​కి, కెమికల్స్​కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్​ని తగ్గించడం లేదా మానేయడం జరగాలి. 

ఇవన్నీ కాలేయాన్ని సహజంగా డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. వైద్యుల సహాయంతో లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరచుకునేందుకు సప్లిమెంట్స్​ కూడా డైట్​లో తీసుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget