Reduce belly fat in 30 days : పొట్ట ఉంటే హార్ట్ఎటాక్ వచ్చే ఛాన్స్‌లు ఎక్కువట.. 30 రోజుల్లో బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోండిలా
Belly Fat : బెల్లీ ఫ్యాట్ ఉండేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి ఈ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసా?

30 Day Tips to Reduce Belly Fat : చాలామందిని వేధించే సమస్యల్లో పొట్ట ఒకటి. అయితే పొట్ట ఎక్కువగా ఉండేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా 35 నుంచి 69 ఏళ్లు ఉన్న మగవారికి పొట్ట ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువని చెప్తున్నారు. మరి ఈ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకునేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? 30 రోజుల్లో పొట్టను తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
నీళ్లు తాగాలి..
అవును హైడ్రేషన్ అనేది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని.. మీరు చేసే పనులకు అనుగుణంగా తాగాలి. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాదు.. హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. మెటబాలీజం పెరుగుతుంది. క్రేవింగ్స్ తగ్గుతాయి.
పోషకాహారం..
పోషకాలతో నిండిన ఆహారం బరువును కంట్రోల్ చేయడంతో పాటు పొట్ట కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వీటిని తినడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు. మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఒబెసిటి లక్షణాలు దూరమవుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ అందుతాయి. ఇవి ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
నిద్రే ప్రధానం
నిద్ర అనేది దాదాపు అన్ని సమస్యలను దూరం చేస్తుంది. దానిలో నిద్ర కూడా ఒకటి. కాబట్టి బెటర్ స్లీప్ కోసం బెడ్ రూమ్ కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. రాత్రి నిద్రకు డార్క్ రూమ్ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మొలాటిన్ పెరుగుతుంది. నిద్రను ప్రేరేపిస్తుంది. కనీసం 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర తక్కువైతే పొట్ట వస్తుందని గుర్తించుకోండి.
మంచి నిద్రకోసం 3-2-1 రూల్ ఫాలో అవ్వాల్సి ఉంటంది. అంటే మూడుగంటల ముందు ఎలాంటి ఫుడ్ తినకుండా ఉండాలి. రెండుగంటల ముందు ఎలాంటి డ్రింక్ తాగకుండా ఉంటుంది. గంట ముందు స్క్రీన్ బంద్ చేయాలి.
వ్యాయామం..
ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా కచ్చితంగా చూసుకోండి. ఇది కొవ్వును కరిగించి.. మెటబాలీజం పెంచడంలో హెల్ప్ చేస్తుంది. కార్డియో చేస్తే కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. వారానికి మూడు నుంచి 5 రోజులు కనీసం వ్యాయామం చేస్తుంది. 10 కె వాక్ చేసేలా చూసుకోండి.
వారికి దూరంగా ఉండండి..
మీకు స్ట్రెస్‌ని ఇచ్చేవారికి దూరంగా ఉండండి. మీకు నచ్చిన వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయండి. కాల్ లేదా మెసేజ్‌ల ద్వారా వారికి టచ్‌లో ఉండండి. మీకు ఎవరి నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుందనుకుంటున్నారో వారికి దూరంగా ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ప్రోటీన్, ఫ్యాట్. కీటోన్స్ని షుగర్‌గా మార్చేస్తుంది.
మరిన్ని టిప్స్
వ్యాయామం చేస్తూ.. హెల్తీగా తింటూ.. ఓపెన్ మైండ్‌తో ఉండేవారితో మీరు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయవచ్చు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేవచ్చు. కార్బ్స్, ఆల్కహాల్, స్వీట్లకు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో ఇన్సులిన్ని పెంచుతాయి. కనీసం 80 శాతం హెల్తీ ఫుడ్‌ని తీసుకోండి 20 శాతం మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు. పరెఫెక్ట్గా తినాలన్నా రూల్ లేదు. దీనివల్ల మీకు క్రేవింగ్స్ తగ్గుతాయి. బెటర్ బాడీని బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. పొట్టను తగ్గిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా వీటిని ట్రై చేసి పొట్టను తగ్గించేసుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















