Weight Loss And Diet : ఇంటి భోజనంతో బరువును ఇలా ఈజీగా తగ్గొచ్చు.. బెల్లీ ఫ్యాట్‌ని వేగంగా తగ్గించే ఫుడ్స్ ఇవే
Homemade Meals : బరువును తగ్గడంలో, ఫిట్‌గా ఉండడంలో ఇంటి భోజనం ముఖ్యపాత్ర పోషిస్తుంది. మరి ఇంట్లోనే ఎలాంటి భోజనం తీసుకుంటే బరువు తగ్గొచ్చొ ఇప్పుడు చూసేద్దాం.
Homemade Meals and Weight Loss : బరువు పెరిగిపోవడానికి అత్యంత ప్రధానమైన రీజన్ ఫుడ్. అలాగే బరువును తగ్గించుకోవడంలో కూడా ఆహారం అంతే హెల్ప్ చేస్తుంది. లైఫ్‌స్టైల్, ఆరోగ్య సమస్యలతో పాటు.. ఫుడ్ కూడా ఊబకాయం పెరగడంలో తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బయటి భోజనం తినేవారిలో ఈ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు గుర్తించారు. బయట ఫుడ్ తింటే బరువు పెరగడమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు.
మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే.. మీరు కచ్చితంగా ఇంటి భోజనానికి షిఫ్ట్ అయిపోవాలని సూచిస్తున్నారు. అయితే ఇంటి భోజనాన్ని కొన్ని పద్ధతుల్లో తీసుకుంటే మీరు ఈజీగా, ఆరోగ్యంగా బరువు తగ్గగలుగుతారు. మీ శరీరాన్ని.. మీ ఫుడ్ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసేలా డైట్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఈ డైట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి ఫుడ్‌ని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో తయారు చేసుకున్న ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పైగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినరు కాబట్టి.. వాటిలోని చక్కెరలు, అన్‌హెల్తీ ఫ్యాట్స్ వంటివి మీ డైట్లో ఉండవు. పోర్షన్ కంట్రోల్ చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు తీసుకోవడంలో ఇంటి భోజనం హెల్ప్ చేస్తుంది. న్యూట్రిషన్స్ బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకోవాలంటే..
- పోర్షన్ కంట్రోల్ : ఇంట్లో భోజనం వండుకోవడం వల్ల మీ శరీరానికి ఎంత కావాలో అంతే వండుకోవచ్చు. దీనికోసం బరువులు కొలిచేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉపయోగించే కప్పుతో మీ కొలతను ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అతిగా తినడం అనేది కంట్రోల్ అవుతుంది.
- పోషకాహారం : పోర్షన్ కంట్రోల్ చేసేప్పుడు ఆ ఫుడ్‌లో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. శరీరానికి పోషకాహారం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యంగా ఉంచడంలోనూ.. బరువు తగ్గడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఫ్రెష్ ఫుడ్, లీన్ ప్రోటీన్లు, మిల్లెట్స్, కూరగాయలు మీ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి బ్యాలెన్స్డ్ డైట్‌ని ప్రమోట్ చేస్తాయి.
- క్యాలరీలు : ప్రాసెస్ చేసిన, రెస్టారెంట్ ఫుడ్స్ కంట్రోల్ చేయడం వల్ల సగం క్యాలరీలు తగ్గుతాయి. ఎందుకంటే అన్‌హెల్తీ ఫ్యాట్స్, షుగర్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంటి భోజనం తీసుకునేప్పుడు దాదాపు ఈ క్యాలరీలు తగ్గుతాయి. అయినా సరే మీరు రోజుకు ఎన్ని క్యాలరీలు తింటున్నారు.. ఎన్ని క్యాలరీలు కరిగిస్తున్నారనేది గుర్తిస్తే బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఎఫెక్టివ్‌గానూ ఉంటుంది.
- క్రేవింగ్స్ కంట్రోల్ : మీకు నచ్చిన ఫుడ్ ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల క్రేవింగ్స్ తగ్గుతాయని మీకు తెలుసా? అవును మీ ఫుడ్ మీరే వండుకోవడం వల్ల మీరు తినే క్వాంటిటీ తగ్గుతుందట. ఎందుకంటే వంట చేసే ప్రాసెస్‌లోనే సగం తృప్తి పొందేస్తారట. దానివల్ల మీకు నచ్చిన ఫుడ్‌ని మీరు లిమిటెడ్‌గా తీసుకోగలుగుతారు.
బరువు తగ్గడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవే..
పండ్లు, కూరగాయాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పీచుపదార్థాల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక కేలరీల స్నాక్స్ ప్లేస్‌ని వీటితో రిప్లేస్ చేయొచ్చు. ఇవి వేగంగా బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మీ డైట్లో వీటిని కచ్చితంగా తీసుకోండి.
అధిక ప్రోటీన్ ఉండే ఫుడ్స్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. లీన్ ప్రోటీన్, చేపలు, చిక్కుళ్లు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్‌కు గొప్పవనరులు. కానీ బరువు తగ్గాలనుకుంటే.. వీటిని మీ శరీరానికి ఏ మోతాదులో అందిస్తున్నారో తెలుసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే ఫుడ్స్
మీరు పొట్ట దగ్గర కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. చియా సీడ్స్, తృణధాన్యాలు, కూరగాయాలు, చిక్కుళ్లు వంటివి బెల్లీ ఫ్యాట్‌ని కరిగించడంలో హెల్ప్ చేస్తాయని పలు అధ్యయనాలు తెలిపాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఇవి మంచిఫలితాలు చూపిస్తాయట. అయితే తీసుకున్న ఆహారం ఫ్యాట్‌ని కరిగించలేవు. కాబట్టి కేలరీలు కంట్రోల్ చేస్తే.. అది బర్న్ అవ్వడంలో మెటబాలీజాన్ని ప్రేరేపిస్తుంది.
ఇలాంటి హెల్తీ ఫుడ్, ఇంటి భోజనం తీసుకుంటూ.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ ఫాలో అయితే బరువు తగ్గడంలో మీరు మంచి ఫలితాలు చూస్తారు.
Also Read : EMS ట్రీట్మెంట్తో కొవ్వు తగ్గుతుందా? వ్యాయామం, డైట్ చేయకపోయినా ఇంచ్ లాస్ అవ్వడంలో నిజమెంతంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.