అన్వేషించండి

TTD Update: తిరుమల శ్రీవారి అన్నప్రసాద మెనూలో మార్పులు.. కొత్తగా చేరిన ఐటెమ్ ఏంటో తెలుసా!

Tirumala Srivari Anna Prasadam : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు అందించే అన్నప్రసాదంలో మార్పులు చేర్పులు చేస్తోంది.

Tirumala Srivari Anna Prasadam News:  కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈసందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉండే భక్తులకు అడుగడుగునా ప్రసాదాలు పంపిణీ చేస్తుంటారు. ఇక అన్నప్రసాదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే లేటెస్ట్ గా శ్రీవారి అన్నప్రసాదాల మెనూలో  టీటీడీ మసాలా వడ చేర్చింది.
 
భక్తులకు కొన్నేళ్లుగా అన్నం, కర్రీ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి, సాంబారు, రసం, మజ్జిగ ప్రసాదంగా వడ్డిస్తున్నారు. ఇప్పుడు అన్నదానం మెనూలో మార్పులు చేయాలని, కొత్త పదార్థాలు ఏడ్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు నిర్ణయించారు.  ఈ మేరకుమెనూలో మరో పదార్థం చేర్చాలని గతేడాది నవంబరులోనే TTD ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందులో భాగంగా జనవరి 20 మధ్యాహ్నం భోజనం సమయంలో ప్రయోగాత్మకంగా మసాలా వడ వడ్డించారు.
 
 
ప్రయోగాత్మకంగా 5 వేల వడ చేయించారు. ఇందులో ఉల్లి, వెల్లుల్లి లేకుండా తయారు చేసి భక్తులకు వడ్డించారు. మరో నాలుగు రోజుల్లో వడల తయారీ సంఖ్య పెంచనున్నారు.  ట్రయల్ రన్ లో లోటుపాట్లు సరిచేసుకుని రథసప్తమి నాటికి అన్నదాన మెనూలో పూర్తిస్థాయిలో వడలు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మసాలా వడనే కంటిన్యూ చేయాలా లేదంటే ఈ స్థానంలో మరేదేనా వంటకం పెట్టాలా అనే ఆలోచనలోనూ ఉన్నారు టీటీడీ అధికారులు  

Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?

తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదం అందించేందుకు TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం భక్తులకు అందుబాటులో ఉంది . ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణలో భాగంగా 44 లక్షల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం 10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు అందించిన దాతలు తామే స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. అన్నప్రసాదానికి విరాళం అందించేవారి పేరు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని ఉన్న కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4 , పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా హాస్పిటల్, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది.

 తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోనూ అన్నప్రసాదాలు అందిస్తారు. ఇంకా వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్ లతో పాటూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందించే ఏర్పాట్లున్నాయి.

Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra 2026 wishes : ఈ ప్రత్యేక శ్లోకాలతో మీ బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయండి!
దసరా 2026: ఈ ప్రత్యేక శ్లోకాలతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి!
19-10-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం, ధనలాభం, ఉద్యోగంలో ఉన్నతి!
19-10-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం, ధనలాభం, ఉద్యోగంలో ఉన్నతి!
19-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: ఈ రోజు ధనయోగం, కొత్త అవకాశాలు!
19-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: ఈ రోజు ధనయోగం, కొత్త అవకాశాలు!
19-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు: అఖండ ధనయోగం, అదృష్టం!
19-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు: అఖండ ధనయోగం, అదృష్టం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget