చాణక్య నీతి: ఇలా ప్రవర్తించడంలో అస్సలు తప్పులేదు!

కృతే ప్రతికృతిం కుర్యాన్త్ హింసేన ప్రతిహింసనమ్
తత్ర దోషో న పతతి దుష్టే దౌష్ట్యం నమాచరేత్

ఎలాంటి వారిలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాణక్యుడు ఈ శ్లోకంలో స్పష్టం చేశారు

మీకు ఉపకారం చేసిన వ్యక్తికి ప్రత్యుపకారం చేయండి

మీతో తగవుకి దిగిన వ్యక్తితో మీరూ దెబ్బలాడండి..లేదంటే అది పిరికితనమే కాదు మూర్ఖత్వం కూడా

దుష్టుడితో వాడికి అర్థమయ్యేలా దుష్టుడిలానే ప్రవర్తించాలి..లేదంటే మీరు చేతకానివారిగా మిగిలిపోతారు

మీపట్ల మంచితనం చూపించేవారికి మీరు ఎప్పుడూ మంచే చేయండి..వారికి మంచి గురించి ఆలోచించండి

ఉపకారికి నుపకారం, హింసకి ప్రతిహింస, దుష్టుడితో దౌష్ట్యము చేయడం తెలివైన పని అని ఈ శ్లోకం అర్థం

అన్ని సందర్భాల్లోనూ మంచితనం ప్రదర్శిస్తూ మౌనంగా కూర్చుంటే నష్టపోయేది మీరే అని గ్రహించాలని బోధించారు చాణక్యుడు