భగవద్గీత: జ్ఞానం, కర్మ, త్యాగం, మోక్షం గురించి కృష్ణుడు ఇలా చెప్పాడు!

Published by: RAMA

భగవద్గీత శ్లోకం - 9

శ్రేయోహిజ్ఞాన మభ్యాసాత్ జ్ఞానద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మ ఫలత్యాగ: త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ||

అభ్యాసము కన్నా జ్ఞానం శ్రేష్టమైనది

అభ్యాసాత్ = అభ్యాసము కంటే
జ్ఞానమ్ = జ్ఞానము
శ్రేయోహి = శ్రేష్టమైనదిగదా

జ్ఞానం కన్నా ధ్యానం శ్రేష్టమైనది

జ్ఞానాత్ = జ్ఞానము కంటే
ధ్యానమ్ = ధ్యానము
విశిష్యతే = శ్రేష్టమగుచున్నది

ధ్యానం కన్నా కర్మఫలం విడవడం విశిష్టమైనది

ధ్యానాత్ = ధ్యానము కంటే
కర్మఫలత్యాగ = కర్మఫలమును విడుచుట
విశిష్ఠ్యతే = శ్రేష్టమగుచున్నది

ఆ కర్మ ఫలం త్యాగంతో శాంతి కలుగుతుంది

త్యాగత్ = కర్మఫల త్యాగము యొక్క
అనంతరము = తర్వాత
శాన్తి = శాంతి (కలుగుచున్నది)

అభ్యాసం అంటే..

నిత్య జీవితంలో ఏదైనా పనిని సక్రమంగా ఆచరించేందుకు చేసే ప్రయత్నం. ఇందుకోసం సాధకుడు తీసుకునే శిక్షణే అభ్యాసం

భగవద్గీత

కౌరవులు, పాండవుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే ముందు యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన జీవిత పాఠం