సుబ్రహ్మణ్యస్వామి ఆరు ముఖాలు దేనికి సంకేతం

Published by: RAMA

లోక కళ్యాణార్థం

లోకాలను పీడించే తారకాసురుడి సంహారం కోసం శివుడి అంశతో జన్మించాడు సుబ్రహ్మణ్యస్వామి

డిసెంబరు 07 సుబ్రహ్మణ్య షష్ఠి

మార్గశిర శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్యస్వామి ఆరు ముఖాలతో జన్మించాడు..

మొదటి ముఖం

మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టే అజ్ఞానాన్ని , ఆధ్యాత్మిక అంధకారాన్ని తొలగిస్తుంది

రెండో ముఖం

పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ఈ ముఖం..ధర్మాన్ని అనుసరించే భక్తులను అనుగ్రహిస్తుంది

మూడో ముఖం

తారకాసురుడిని వధించిన స్వరూపానికి నిదర్శనంగా ఉండే ఈ ముఖం భక్తుల పూజలు అందుకుని ఆశీర్వదిస్తుంది

నాలుగో ముఖం

శరుణు కోరిన వారిని సంరక్షించే నాలుగో ముఖం.. స్వీయ సాక్షాత్కారం కోసం అన్వేషణలో ఉండే భక్తులను అనుగ్రహిస్తుంది

ఐదో ముఖం

శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ఐదో ముఖం..అధర్మాన్ని పాటించేవారిని నాశనం చేస్తుంది

ఆరో ముఖం

లౌకిక సంపదల్ని అందించే ఆరో ముఖం..తన భార్యలైన వల్లీ దేవసేనపై ప్రేమను కురిపిస్తుంది