అష్టోత్తర శతనామావళి వెనుకున్న రహస్యం తెలుసా! భగవంతుడి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి చదువుతారు.. అష్టోత్తర శతనామాలు అంటే 108 నామాలు.. ఈ లెక్క ఎందుకు? సహ్రస నామాలుంటాయి..వాటిని 100 నామాలుగా కుదించవచ్చు కదా 108 అనే నంబర్ కి ఇంత ప్రాధాన్యత ఎందుకు..దానివెనుకున్న రహస్యం ఏంటో తెలుసా! అశ్విని, భరణి నుంచి పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి..మొదటిపాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం... 27 * 4 108.. అంటే 27 నక్షత్రాలలో ఒక్కో పాదానికి ఒక్కో నామం లెక్కగా ఉండేందుకే 108 ఏ నక్షత్రంలో పుట్టినా, మీది ఏ పాదం అయినా.. అందరూ భగవంతుడి పేరుమీద జన్మించినట్టే అని అర్థం