చాణక్యనీతి: అసంతృప్తి కూడా ఆనందమే జీవితంలో అన్ని సందర్భాల్లో విజయం, సంతృప్తి ఇవే ఆనందాన్నిస్తాయని అనుకోవద్దంటారు చాణక్యుడు కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కూడా అత్యంత ఆనందాన్నిస్తుందని తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ముఖ్యంగా మూడు సందర్భాల్లో అసంతృప్తి ఉంటే పనికొస్తారని, జీవితంలో పైకొస్తారని చాణక్యుడు శిష్యులకు బోధించారు వాటిలో మొదటిది విద్య - జ్ఞానం. ఈ విషయంలో అసంతృప్తి ఉన్నప్పుడే నిత్యం నేర్చుకోవడంపై ఆసక్తి ఉంటుంది రెండోది..ఎన్ని దానధర్మాలు చేసినా ఇంకా సరిపోదు ఇంకా ఏదైనా చేయాలనే అసంతృప్తి ఉన్నప్పుడే మరికొందరికి సహాయం చేయగలరు మూడోది.. భగవంతుడిని స్మరించడంలో ఎంత అసంతృప్తి ఉంటే అంత భక్తి పెరుగుతుంది..దేవుడికి అంత దగ్గరవుతారు ఈమూడు విషయాల్లో అసంతృప్తి ఉన్నప్పుడే సంతృప్తిగా జీవిస్తారని శిష్యులకు బోధించారు చాణక్యుడు అయితే..డబ్బు, జీవిత భాగస్వామి విషయంలో సంతృప్తి ఉండాలని సూచించారు చాణక్యుడు