అమావాస్యతో కార్తీకమాసం ముగింపు - ఈ రోజు ఏం చేయాలి!
అమావాస్య అంటే పితృదేవతల తిథి..అయితే కార్తీకమాసం నెలరోజులు నియమాలు పాటించేవారికి అమావాస్య మరింత ప్రత్యేకం
కార్తీక అమావాస్య తిథి నవంబరు 30 శనివారం, డిసెంబరు 1 ఆదివారం రెండు రోజులు ఉండడంతో ఏ రోజు ఏం చేయాలి అనే సందేహం ఉంది
సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథి రోజు తెల్లవారుజామునే స్నానమాచరించి కార్తీక దీపాలు వెలిగిస్తారు...
పితృ తర్పణాలు విడిచేవారు, పిండ ప్రదానం చేసేవారు అమావాస్య తిథి మధ్యాహ్నానికి ఉండేలా చూసుకుంటారు
అమావాస్య ఘడియలు నవంబరు 30 శనివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి డిసెంబరు 1ఆదివారం ఉదయం 10 గంటల 11 నిముషాల వరకూ ఉన్నాయి
మీరు కార్తీక స్నానం ఆచరించి దీపాలు వెలిగించాలి అనుకుంటే డిసెంబరు 01 ఆదివారం కార్తీక అమావాస్య జరుపుకోండి
పితృదేవతలను స్మరించుకోవాలి, పిండప్రదానం చేయాలి, దాన ధర్మాలు చేయాలి అనుకుంటే నవంబరు 30 శనివారం అమావాస్య రోజు పాటించండి
శనిదోషం నుంచి విముక్తి పొందేందుకు ఈ రోజు శని ఆరాధన, శివారాధన, హనుమాన్ చాలీశా పఠించండి