శబరిమలలో భక్తుల వసతిపై దేవస్థానం కీలక ప్రకటన!
శబరిమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇందులో భాగంగా వసతి కోసం భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కీలక సూచనలు చేసింది దేవస్థానం
రూమ్స్ ని ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే కేవలం ట్రావెన్ కోర్ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు
www.onlinetdb.com వెబ్ సైట్లో లాగిన్ అయిన తర్వాత రూమ్స్ ని బుక్ చేసుకోవాలి
ఇప్పటికే లాగిన్ ఉంటే నేరుగా లాగిన్ కావొచ్చు..ఫస్ట్ టైమ్ వెబ్ సైట్ ని విజిట్ చేసేవారు రూమ్స్ బుక్ చేసుకోవాలంటే రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది
రూమ్స్ అందుబాటులో ఉన్నాయో లోవో స్పష్టంగా తెలుసుకుని..భక్తుల వివరాలు నమోదు చేసుకుని..అనంతరం పేమెంట్ చేయాలి..
రూమ్ బుక్ చేసుకున్నవాళ్లు..అక్కడకు చేరుకున్న తర్వాత మీ ఐడీ కార్డ్, ఫొటో చూపించాల్సి ఉంటుంది.
రూమ్ లో ఎంతమంది ఉంటారో ఆన్ లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడే స్పష్టం చేయాలి. ఎక్కువ మందిని తీసుకెళితే..అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది...
శబరిమల చేరుకున్న తర్వాత రూమ్స్ కోసం ఇక్కట్లు పడేకన్నా ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు