చాణక్య నీతి: మీ నాలుకపై ఉన్నది విషమా-అమృతమా! మనిషి మాటతీరు, ప్రవర్తన, నడవడిక, సంస్కారం గురించి తన నీతి శాస్త్రంలో బోధించారు ఆచార్య చాణక్యుడు సంస్కారం అంటే ఏంటో చిన్న మాటతో అన్ని తరాల వారికి అర్థమయ్యేలా పేర్కొన్నారు చాణక్యుడు మనిషి నాలుకపై విషం - అమృతం రెండూ ఉంటాయి.. మీరు దేనిని తీసుకుంటారన్నది మీ సంస్కారంపై ఆధారపడి ఉంటుంది ఓ వ్యక్తి గురించి మంచి చెప్పాలన్నా, చెడు చెప్పాలన్నా అది నాలుకతోనే జరుగుతుంది... మంచి-చెడు ఏం మాట్లాడాలో నిర్ణయించేది మీ జన్మ సంస్కారంపై ఆధారపడి ఉంటుంది ఎంత వెలుగు విరజిమ్మినా మిణుగురు పురుగు అగ్నికాదు ఓ మనిషి వృద్ధుడు అయినంత మాత్రాన విజ్ఞుడు కావాలనే నియమం లేదు... జీవితకాలంలో మీరు సంపాదించే పేరు ప్రతిష్టలన్నింటికీ మూలకారణం మీ సంస్కారమే అవుతుంది...