రామ్ చరణ్ దర్గా వివాదంపై రాధా మనోహర్ దాస్ సీరియస్!

Published by: RAMA

అయ్యప్పమాలలో దర్గాకి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదమవుతోంది. 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆలయ సందర్శన

దర్గాకు సమీపంలో ఉన్న విజయ దుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే అయ్యప్పమాలలో ఉండగా దర్గాను దర్శించుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు

నిజమైన భక్తుడు

రామ్ చరణ్ విషయంపై రియాక్టైన రాధామనోహర్ దాస్..అందరికన్నా చరణ్ నిజమైన భక్తుడు అని క్లారిటీ ఇచ్చారు. శివాలయాన్ని శుభ్రం చేశాడు, తన బిడ్డకి లిలితా సహస్రంలో ఉన్న క్లీంకార అనే పేరు పెట్టాడు. RRR ప్రమోషన్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తనవెంట రాములవారిని తీసుకెళ్లాడు.

దర్గా కాదది...

అయినా కడపలో ఉన్నది దర్గా కాదు వేంకటేశ్వరస్వామి గుడి. కడప రాయుడి ఆలయంలో వేంకటేశ్వరస్వామి వెనుక ఆంజనేయుడు ఉంటాడు. వేంకటేశ్వరుడి గుడిని ఆక్రమించి దర్గాగా మారిస్తే విగ్రహాన్ని తీసుకెళ్లి ఆంజనేయుడి గుడిలో పెట్టారన్నారు రాధా మనోహర్ దాస్

ఆలయమే

మన దేశంలో ఉన్న చాలా దర్గాలు, మసీదులు గతంలో హిందూ దేవాలయాలే అన్నారు రాధా మనోహర్ దాస్.

తప్పు చేయలేదు

చరణ్ తప్పుచేసినట్టు మీకు అనిపిస్తే నా దగ్గరకు రండి..తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం..అంతేకానీ తప్పుగా ప్రచారం చేయొద్దన్నారు.

వాళ్లని అడిగారా?

రాముడిని, కృష్ణుడిని అవమానించే పాస్టర్లున్నారు..వాళ్లని ఎప్పుడైనా నిలదీశారా అని ప్రశ్నించారు రాధా మనోహర్ దాస్.

మీరూ ఇలా చేయండి..

క్రిస్ మస్ కి కేక్ ఇచ్చినవారికి మీరు వెంటనే లడ్డూ ప్రసాదం ఇవ్వండి.. మిమ్మల్ని దర్గాకి ఆహ్వానించినవారిని మీరు ఆలయానికి ఆహ్వానించండి అని పిలుపునిచ్చారు రాధా మనోహర్ దాస్