చాణక్య నీతి: మనిషిని మానసికంగా కృంగదీసే పరిస్థితులు ఇవే

శారీరక బాధ కన్నా మానసిక బాధ అత్యంత ప్రమాదకరం..ఇదే విషయాన్ని తన నీతిశాస్త్రంలో ప్రస్తావించారు చాణక్యుడు

మనిషిని మానసికంగా కృంగదీసే సంఘటనలు కొన్ని ఉంటాయని పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు

భర్త కన్నా ముందే భార్య చనిపోతే..ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. తన జీవితం అత్యంత దుర్భరంగా ఉంటుంది

ఎవరికోసం అయితే అనుక్షణం పాకులాడుతారో, ఎవరికోసం అయితే కష్టపడతారో..అలాంటి సొంతవారినుంచే అవమానాలు ఎదుర్కోవడం

కొన్ని సందర్భాల్లో అనర్హులైన పాలకులు, అర్హత లేకుండా అధికారం చేపట్టినవారికి సేవలు చేయాల్సి వస్తుంది..అదీ దుర్భర పరిస్థితే

ఏ విషయంలో అయినా సమఉజ్జీ ఉండాలన్నది చాణక్యుడి భావన..అలాంటి సమఉజ్జీ కాని వ్యక్తితో కలసి ఉండడం కన్నా నరకం మరొకటి ఉండదు

ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వ్యక్తి మానసికంగా కృంగిపోతాడని....జీవితంలో ఇంతకన్నా క్లిష్ట పరిస్థితులు ఉండవు

చాణక్యుడు నీతిశాస్త్రంలో పేర్కొన్న ప్రతి విషయం ఏ తరం అయినా అనుసరించేవిగా ఉంటాయంటారు పండితులు