చాణక్య నీతి: కొడుకు అంటే ఇలా ఉండాలి! సంతానం అంటే చాణక్యుడు దృష్టిలో కేవలం మగ పిల్లలు మాత్రమే.. స్త్రీ సంతానాన్ని ఆయన అస్సలు పరిగణలోకి తీసుకోలేదు ఆడపిల్లలు కేవలం భర్తకు సేవలు చేసేందుకు..మగపిల్లల్ని కనిచ్చేందుకు మాత్రమే అని చాణక్యుడి భావన అందుకే..కేవలం ఉత్తమ కొడుక్కి ఉండాల్సిన లక్షణాల గురించి ప్రత్యేకంగా నీతిశాస్త్రంలో ప్రస్తావించారు చాణక్యుడు కొడుకు ఉండడం కాదు.. జ్ఞాన సంపన్నుడైన కొడుకు ఉండడం ప్రధానం అని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు సువాసనగల పూల చెట్టు అడవి మొత్తం పరిమళాలు వెదజల్లుతుంది. జ్ఞానసంపన్నుడైన వ్యక్తి వల్ల వంశానికి పేరొస్తుంది ఎండిన వృక్షం అగ్నికి ఆహుతైతే అడవి మొత్తం మండిపోతుంది.. అనర్హుడైన కొడుకు కుటుంబం మొత్తానికి చెడ్డపేరు తీసుకొస్తాడు చందమామ రాత్రి మొత్తం వెలుగునిస్తాడు...ఉన్నత విద్యావంతుడు, నీతిమంతుడు అయిన కుమారుడు వంశానికి వెలుగునిస్తాడు ఎందుకూ పనికిరాని పలువురు కుమారుల కన్నా.. తెలివైన, విద్యావంతుడైన ఒక్క కుమారుడు చాలు .. తనపై ఆధారపడిన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలంటే సమర్ధుడైన కుమారుడు ఉండాలి ఒక్క చందమామ చీకటిని పారద్రోలుతుంది..వెయ్యి నక్షత్రాలు కలిసినా ఈ పని చేయలేవు