అమావాస్య రోజు, ప్రతి శనివారం ఈ మంత్రం తప్పనిసరిగా పఠించండి

Published by: RAMA

శని ప్రభావం తప్పదు

ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని..ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో దశలో శని ప్రభావాన్ని ఎదుర్కోకతప్పదు

ప్రత్యేక పూజలు

శని నుంచి తప్పించుకోలేం కానీ ఆ ప్రభావం తగ్గించుకునేందుకు ప్రతి శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు

ఇది పఠించండి

ప్రతి శనివారం శని శాంతి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే మీపై ఉండే శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతారు

పూర్వ వైభవం తథ్యం

రాజ్యాన్ని పోగొట్టుకుని వంటవాడిగా , రథసారధిగా ఉండిపోయిన నలమహారాజు ఈ మంత్రాన్ని పఠించి తిరిగి పూర్వవైభవాన్ని పొందాడు

ఛాయామార్తాండ సంభూతం

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

అర్క పుత్రాయ

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

సూర్య పుత్రం నమోస్తుతే

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ శుద్ధబుద్ధి ప్రదాయనే

శని స్తుతి

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

11 సార్లు పఠించండి

శని శాంతి మంత్రం 11 సార్లు పఠించిన తర్వాత ఈ శ్లోకాన్ని 11సార్లు పఠించాలి
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే