చాణక్య నీతి: మీ జీవిత భాగస్వామి ఇలానే ఉన్నారా!

ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రంలో కేవలం రాజనీతి గురించి మాత్రమే కాదు...జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలున్నాయి

ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేవారు కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు చాణక్యుడు

మతంపై ఉన్న ఆసక్తి-అనాశక్తిని తెలుసుకోండి..ఓ పద్ధతిని పద్ధతిగా అనుసరించే వ్యక్తి కుటుంబ విషయంలోనూ అంతే పద్ధతిగా ఉంటారు

జీవితం పూలపాన్పుకాదు..ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది...అలాంటి సమయంలో బయటపడాలంటే సహనం చాలా అవసరం

సహనం ఉండే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటే మీజీవితంలో కష్టాలు వచ్చినా వాటినుంచి బయటపడడం అత్యంత సులభం

బాహ్య సౌందర్యాన్ని చూసి కాకుండా..మానసిక అందాన్ని గుర్తించండి. అర్థంచేసుకోని భాగస్వామి అందంగా ఉండి ఏం ఉపయోగం..

మీగురించి మీకన్నా ఎవరికీ బాగా తెలియదు..అందుకే మీ జీవితంలోకి ఎలాంటి వ్యక్తి అడుగుపెట్టాలో మీకన్నా ఎవరూ బాగా ఆలోచించలేరు

సంతోషాన్ని పంచుకునేందుకు మీ చుట్టూ చాలామంది ఉండొద్దు కానీ..మీ కష్టకాలంలో మీకు అండగా నడిచేది జీవిత భాగస్వామి మాత్రమే..

ఒకరి ఒత్తిడితో ఎప్పుడూ నిర్ణయం తీసుకోవద్దు. అది భవిష్యత్ లో మీ ఇద్దరి జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుందని సూచించారు చాణక్యుడు