నిత్యం సంధ్యా సమయంలో ఈ స్తోత్రం పఠిస్తే ఇల్లంతా ఐశ్వర్యమే!
వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||
ఓ పేదరాలింటికి భిక్షకు వెళ్లిన ఆదిశంకరాచార్యులు..ఆ ఇంట దారిద్ర్యం చూసి చలించిపోయారు..
కటిక దారిద్ర్యంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు ఇల్లంతా వెతికితే ఓ ఉసిరికాయ కనిపించింది..
ఇంటి ముందు నిల్చున్న సన్యాసిని ఖాళీ చేతులతో పంపించడం ఇష్టంలేక ఆ ఉసిరికాయ దానం చేసింది
ఆ మహాతల్లి అనుభవిస్తున్న దారిద్ర్యం తొలగించాలని భావించిన ఆదిశంకరాచార్యులు లక్ష్మీదేవిని ప్రార్థించారు
ఆ సమయంలో ఆదిశంకరులు నోట ఆశువుగా వచ్చినదే కనకధారా స్తోత్రం.
కనకధారా స్తోత్రాన్ని పఠించిన వెంటనే ఆ పేద వృద్ధురాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది
నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు
నిత్యం సంధ్యాసమయంలో దీపం పెట్టుకునే అలవాటున్నవారు దేవుడి దగ్గర కూర్చుని ఈ స్తోత్రం భక్తి శ్రద్ధలతో పఠించండి