చాణక్య నీతి: మీరు ఎప్పటికీ గొడవపడకూడని నలుగురు వ్యక్తులు వీళ్లే!

చాణక్యుడు సూచించిన నీతిసూత్రాలు అనుసరిస్తే ఎంత కష్టాన్ని అయినా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మీ సొంతం అవుతుంది

మీరు ఎవరితో మంచిగా ఉండాలో చెప్పిన చాణక్యుడు..ఎవరితో అస్సలు గొడవపడకూడదో కూడా నీతిశాస్త్రంలో పేర్కొన్నారు

చాణక్యుడు చెప్పిన ఆ నలుగురు...
1. మూర్ఖుడు 2. గురువు 3. ప్రియమైనవారు 4.స్నేహితులు

మూర్ఖుడితో వాదనవల్ల వారి ఈగో సంతృప్తి చెందుతుకానీ మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు..పైగా సమయం వృధా

జీవితంలో మీరు ఉన్నత స్థానంలో ఉండేందుకు కారణం అయిన గురువుకి దండించే హక్కు ఉంటుంది. మీరు తలొంచాల్సిందే

గ్రహస్థితి బాలేకున్నా గురువు అనుగ్రహం ఉంటే జీవితం పరిపూర్ణం అంటారు..అలాంటి గురువుతో వాదనకు దిగకూడదు

మీకు అత్యంత ప్రియమైనవారితో వాదనలు పెట్టుకుంటే వారికన్నా మీరే ఎక్కువ నష్టపోతారు..ఏ పనిపైనా శ్రద్ధపెట్టలేక నష్టపోతారు

కష్టం, సుఖంలో తోడుగా నిలిచేది మంచి స్నేహితుడే.. మీరు మంచి చేస్తే పొగుడుతారు తప్పు చేస్తే నిలదీస్తారు..

ఈ నలుగురితో విభేదాలు, వివాదాలుంటే నష్టం మీకే ఎక్కువని గుర్తిస్తే మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది