చాణక్యనీతి: సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తే ఇది చదవండి!

పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వంపునర్లభ్యం న శరీరం పునఃపునః।।

పోయిన డబ్బు మళ్లీ రావొచ్చు, వదిలివెళ్లిపోయిన మిత్రుడు మళ్లీ చేరువకావొచ్చు...

జీవిత భాగస్వామి పోతే..మరో వ్యక్తితో బంధం ముడివేసుకోవచ్చు..

ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలేస్తే ఎప్పటికీ తిరిగి రాలేరని శరీరం గొప్పతనం చెప్పారు చాణక్యుడు

శరీరం ఉన్నంతసేపే మంచి పనులు చేయగలరు..మనిషిగా పుట్టినందుకు ప్రాణం, శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి

జంతువులకు శరీరం ఉంటుంది కానీ వాటికి ఆలోచన ఉండదు...బుద్ధి, ఆలోచన మనుషులకే సొంతం

అతి తిండి, నిద్ర, ఆలోచనా, బాధ.. శరీరానికి నష్టం..సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఇవే శరీరానికి దివ్య ఔషధాలు

తిని పడేసే ఆకులాంటిదే శరీరం.. భోజనం చేసినంతసేపే ఆకు..ప్రాణం ఉన్నంతసేపే శరీరం

విసిరేస్తున్నప్పుడు ఆకు సంతోషిస్తుందట..ఒకరి ఆకలి తీర్చానని.. మరి మనిషి ఆలోచన ఎలా ఉండాలి!