అన్వేషించండి

Mauni Amavasya 2025 : జనవరి 29 మౌని అమావాస్య..ఈ రోజు రావిచెట్టు దగ్గర దీపం వెలిగిస్తే!

Mauni Amavasya 2025 : జనవరి 29 బుధవారం పుష్యమాస అమావాస్య. దీనినే సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు విశిష్టత ఏంటంటే..

Mauni Amavasya 2025 Date and Time:  ఏటా పుష్యమాసం ఆఖరి రోజు వచ్చే అమావాస్యను  చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని పిలుస్తారు.  ఏడాది పొడవునా మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెబుతారు పండితులు. ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకం అని చెబుతారు. 

సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వచనం కోసం  తర్పణాలు విడుస్తారు, పిండప్రదానాలు చేస్తారు..దాన ధర్మాలు అన్నదానాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్య అత్యంత విశేషమైనది. 

2025 లో జనవరి 29 బుధవారం మౌని అమావాస్య వచ్చింది. ఈ రోజు శ్రీమహా విష్ణు ఆరాధన చేయడం, భాగవత పారాయణం చేయడం శుభకరం. ఈ రోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాన్నిస్తాయి. ఈ రోజు చేసే పూజ, ఉపవాసం..కుటుంబం అభివృద్ధికి దోహదం చేస్తాయి.  

Also Read: జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు తేదీలివే!

మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం. మౌని అమావాస్య రోజు సముద్రస్నానం ఆచిరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెబుతారు. సముద్రస్నానం కుదరనివారు నదీస్నానం చేసినా అత్తుత్తమం. అయితే ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా అక్కడ స్నానమాచరిస్తే మరింత పుణ్యం. 

పితృ దోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగిపాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.  

మౌని అమావాస్య రోజు రావిచెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు..ఈ రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి. చెట్టు చుట్టూ దారాలు చుడుతూ 108 ప్రదక్షిణలు చేయాలి 

Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
 
మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది.  దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. 

చొల్లంగి అమావాస్య రోజు ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.అమావాస్య రోజు పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని గరుడపురాణంలో ఉంది
 
ఈ రోజు ఆకలితో మీ ఇంటిముందుకి వచ్చిన వారిని ఖాళీచేతులతో పంపించకండి. ఆహారం పెట్టంది..అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి.  
 
అమావాస్య రోజు మాత్రమే కాదు ఏ రోజూ మూగజీవాలను హింసించవద్దు. వాటికి ఆహారం ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు కానీ హింసకు పాల్పడవద్దు.  ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం అందించండి. 

Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి

మౌని అమావాస్య రోజు చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి. చీమలు ఐకమత్యానికి నిదర్శనం..ఒకే పుట్టలో కలసి ఉండడమే కాదు శ్రమైక జీవనానికి నిదర్శనం. అందుకే వాటికి ఆహారం అందిస్తే మంచిదంటారు.

గమనిక: మత గ్రంధాల్లో పేర్కొన్నవి, పండితులు సూచించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది.. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP DesamIPL 2025 Disha Patani Dance Controversy | ఐపీఎల్ వేడుకల్లో దిశా పటానీ డ్యాన్సులపై భారీ ట్రోలింగ్ | ABP DesamKKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
NTR Neel Movie: ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్... 'డ్రాగన్' కోసం లేట్ నైట్ డిస్కషన్లు!
ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్... 'డ్రాగన్' కోసం లేట్ నైట్ డిస్కషన్లు!
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
AP Pensions: త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
Embed widget