Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టానికి 347 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో దిగిన టీమిండియా 156 పరుగులకే చేతులెత్తేసింది. అయితే ఈ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. పాక్ ప్లేయర్ మధ్య వివాదం జరిగింది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
భారత స్కోరు 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు వైభవ్ సూర్యవంశీ.. అలీ రజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ వికెట్ పడటంతో పాక్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. అవుట్ అయ్యాక వైభవ్ పెవిలియన్ వైపు వెళ్తుంటే.. పాక్ ప్లేయర్ అతడిని ఉద్దేశించి ఓ కామెంట్ చేశాడు. దాంతో వైభవ్ ఘాటుగా స్పందించాడు. వెనక్కి తిరిగి పాక్ టీమ్ వైపు చూస్తూ తన షూను చూపించాడు. వీరి మధ్య అంప్లైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఆలా చూపిస్తున్న వైభవ్ ఉద్దేశం ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.





















