అన్వేషించండి

IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav | భారత్, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కావడం భారత్‌కు కలిసిరానుంది.

IND vs NZ T20 World Cup 2026 Final: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మెగా మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టీ20 ఇంటర్నేషనల్‌లో ముఖాముఖీ పోరులో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఇరు జట్లలోనూ  ఉన్నారు. అయితే బ్యాటింగ్‌లో నిలకడగా రాణించి, పరుగుల వరద పారించిన ఆటగాళ్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.  పొందారు.

సూర్యకుమార్ యాదవ్ అద్భుత రికార్డు

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌పై టీ20లో అసాధారణ రికార్డును కలిగి ఉన్నారు. సూర్యకుమార్ 2021 నుండి 2026 మధ్య ఆడిన 13 మ్యాచ్‌ల్లో 526 పరుగులు చేశారు. కివీస్ జట్టుపై SKY సగటు 58.44గా ఉండగా, స్ట్రైక్ రేట్ 170.77గా ఉంది. ఇది టీ20 క్రికెట్‌లో ఎంతో మెరుగైన ప్రదర్శనగా చెప్పవచ్చు. 

సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌పై ఒక సెంచరీతో పాటు 4 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. సూర్య అత్యధిక స్కోరు నాటౌట్ 111 పరుగులు. అతడి దూకుడు బ్యాటింగ్ స్టైల్ ఫైనల్‌లోనూ భారత జట్టుకు కీలకం కానుంది.

రోహిత్ శర్మ 

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ న్యూజిలాండ్‌పై 17 టీ20 మ్యాచ్‌ల్లో 511 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ సగటు 34.06, స్ట్రైక్ రేట్ 141.16గా ఉంది. రోహిత్ శర్మ ఈ జట్టుపై 6 అర్ధ సెంచరీలు సాధించాడు. అతడి అనుభవం, పెద్ద మ్యాచ్‌ల్లో ఆడే సామర్థ్యం భారత్‌కు ఎప్పుడూ కీలకం అయింది.

న్యూజిలాండ్ బ్యాటర్లు సైతం మెరుగైన రికార్డు..

న్యూజిలాండ్ తరపున కొలిన్ మన్రో భారత్‌పై 12 టీ20 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ సుమారు 149గా ఉండటంతో పాటు ఒక సెంచరీ సాధించాడు.

కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ భారత్‌పై 15 మ్యాచ్‌ల్లో 425 పరుగులు చేశాడు. అతడి దూకుడు బ్యాటింగ్ పలుమార్లు భారత బౌలర్లకు సవాలుగా మారడం తెలిసిందే.

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. భారత్‌పై 13 మ్యాచ్‌ల్లో కేన్ విలియమ్సన్ 419 పరుగులు చేసి, పలు సందర్భాల్లో కివీస్ జట్టును ఆదుకున్నాడు.

ఫైనల్‌లో బ్యాటర్లపైనే అందరి కళ్లు

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో పలువురు బ్యాటర్ల ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పెద్ద గ్రౌండ్ అయినప్పటికీ, ఇక్కడ పలుమార్లు భారీ స్కోర్లు నమోదయ్యాయి. భారత్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి దూకుడుగా ఆడే బ్యాటర్లపై ఆశలు పెట్టుకుంది. చివర్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే ఎలాగూ తమ వంతు పాత్ర పోషించనున్నారు. న్యూజిలాండ్ సైతం బెస్ట్ బ్యాటింగ్ ఆటగాళ్లతో పరుగుల వరద పారించేందుకు సిద్ధంగా ఉంది. ఎలాగైనా సరే ఫైనల్లో భారత్‌ను ఓడించి తొలిసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో నేటి రాత్రి జరగనున్న పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో పరుగుల వరద ఖాయమనిపిస్తోంది. నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు చేయక తప్పదని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ajinkya Rahane Record: కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎలో చరిత్రలోనే వరస్ట్ !
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎలో చరిత్రలోనే వరస్ట్ !
PBKS Hat-Trick Wins IPL 2026: పంజాబ్ న‌యా రికార్డు.. అన్ బీటెన్ గా నిలిచి కొత్త ఘ‌న‌త‌.. రాణించిన ఆర్య‌, కాన్లీ, యాన్సెన్, ల‌క్నో చిత్తు
పంజాబ్ న‌యా రికార్డు.. అన్ బీటెన్ గా నిలిచి కొత్త ఘ‌న‌త‌.. రాణించిన ఆర్య‌, కాన్లీ, యాన్సెన్, ల‌క్నో చిత్తు
PBKS Highest Score in IPL 2026: పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
IPL 2026 KKR VS RR Result Update: రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
US Iran Peace Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
KCR re entry: జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
NTR : చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
Ajinkya Rahane Record: కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎలో చరిత్రలోనే వరస్ట్ !
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎలో చరిత్రలోనే వరస్ట్ !
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
PM Modi Viral Video: సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
Embed widget